తెలంగాణ

telangana

By

Published : Mar 8, 2022, 10:53 AM IST

ETV Bharat / sports

IPL 2022: ఆడనన్నా.. ఆర్చర్​కు ఎందుకంత ధర?

IPL 2022 Jofra Archer Mumbai indians: ఈ సీజన్​లో ఇంగ్లాండ్​ ఫాస్ట్​ బౌలర్​ జోఫ్రా ఆర్చర్​ ఆడనప్పటికీ.. ముంబయి ఇండియన్స్​ భారీ ధరకు కొనుగోలు చేసింది. అతడిని తీసుకోవడానికి కారణాలేంటి? అతడి రికార్డు ఎలా ఉన్నాయి? తెలుసుకుందాం..

archer
ఆర్చర్​

IPL 2022 Jofra Archer Mumbai indians: ఈ ఐపీఎల్​ మెగావేలంలో ఇంగ్లాండ్​ ఫాస్ట్​ బౌలర్​ జోఫ్రా ఆర్చర్​ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఈ సీజన్​లో అతడు అందుబాటులో ఉండనప్పటికీ ముంబయి ఇండియన్స్​ రూ.8కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్థాన్​ రాయల్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​తో పోటీపడి మరీ భారీ ధరకు సొంతం చేసుకుంది. ప్రస్తుత లీగ్​లో ఆడనని చెప్పినప్పటికీ అతడిని ముంబయి ఎంచుకోవడానికి పలు కారణాలు ఉన్నాయి. అవేంటంటే..

  • ట్రెంట్​ బోల్ట్​ను వదులుకోవడం వల్ల బుమ్రాకు సరైనా జోడీ కోసం అతడిని తీసుకుంది.
  • పవర్​ ప్లే, డెత్​ ఓవర్లలో కూడా ఆర్చర్​ అద్భుతంగా బౌలింగ్​ చేయగలడు. అతడి యార్కర్​, షార్ట్​ బంతులకు ప్రత్యర్థికి చెమటలు పడతాయి.
  • టీ20ల్లో అతడికి మంచి రికార్డు ఉంది.
  • ఈ ఒక్క సీజన్​ ఆడకున్నా... 2023లో కచ్చితంగా ఆడతాడు!
  • ఆర్చర్​ డ్రెసింగ్​ రూమ్​లో సహ ఆటగాళ్లతో బాగా కలిసిపోతాడు. ఆటగాళ్లపై ప్రభావం చూపగలడు. అనుభవం లేని ప్లేయర్లలో స్ఫూర్తిని నింపగలడు.
  • ఇక 2018 సీజన్​లో అరంగేట్రంలోనే అతడు అద్భుతంగా ఆడాడు.
  • ఐపీఎల్​లో ఆర్చర్​కు మంచి రికార్డు ఉంది. 2018లో అరంగేట్రం చేసిన అతడు.. ఇప్పటివరకు 35 మ్యాచులు ఆడి, 21.32 సగటు, 7.13 ఎకానమీ రేటుతో 46 వికెట్లు తీశాడు. 2018లో 10మ్యాచుల్లో 15 వికెట్లు, 2019లో 11 మ్యాచుల్లో 11వికెట్లు దక్కించుకున్నాడు. అప్పుడు అతడి ఎకానమీ రేటు ఓవర్​కు 6.76గా ఉంది. 2020లో 14 మ్యాచులు ఆడి 20 వికెట్లను తీయగా ఎకానమీ రేటు ఓవర్​కు 6.55గా ఉంది.
  • టీ20 ఫార్మాట్​లో మొత్తంగా 121 మ్యాచులు ఆడి 153 వికెట్లు తీశాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్​ ప్రదర్శన 18 పరుగులకు 4 వికెట్లు.

కాగా, 2019 వన్డే ప్రపంచకప్​ అనంతరం ఆర్చర్​ మోచేతికి గాయమైంది. దీంతో 2020లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ కారణంగా 2021 సీజన్​కు పూర్తిగా దూరమయ్యాడు. అంతర్జాతీయ మ్యాచులతో పాటు ఎటువంటి లీగ్స్​ కూడా ఆడలేదు. గాయం నుంచి కోలుకున్న తర్వాత 2022 సీజన్​ ఆడనని చెప్పాడు. కానీ మెగావేలంలో కనీస ధర రూ.2కోట్లతో వేలంలోకి వచ్చాడు.

ఇదీ చూడండి:కోహ్లీని ఇంకెప్పుడూ కెప్టెన్​గా చూడలేమా?

ABOUT THE AUTHOR

...view details