బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో జరిగిన ఓ సంఘటనను పాక్ క్రికెట్ ప్రధాన కోచ్ సక్లయిన్ ముస్తాక్ గుర్తు చేసుకున్నాడు. తొలుత గంగూలీ గురించి తప్పుడు అభిప్రాయంతో ఉండేవాడినని.. అయితే బీసీసీఐ అధ్యక్షుడు చేసిన దానికి ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నాడు.
"మొదటిసారి నేను గంగూలీని కలిసేటప్పుడు కాస్త కంగారు పడ్డా. ఎందుకంటే అతడు టీమ్‌ఇండియా కెప్టెన్, దిగ్గజ క్రికెటర్. అలాంటి వ్యక్తి నిన్ను ఎందుకు కలుస్తాడని కొందరు చెప్పడం వల్ల ఆందోళన ఇంకొంచెం పెరిగింది. అయితేనేం చివరికి కలిశా.. కానీ 'హలో', 'హాయ్' మాటలకే గంగూలీ పరిమితమయ్యాడు. దీంతో దాదా తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని భావించా. ఎప్పుడూ మాట్లాడకూడదని అనుకొన్నా. అయితే 2003-2004 సీజన్‌లో భారత్‌తో ఆడేందుకు నాకు మళ్లీ అవకాశం వచ్చింది. అప్పటికే నా మోకాలికి చిన్న ఆపరేషన్ జరిగింది. సచిన్ కూడా ఎల్బోకి శస్త్రచికిత్స చేయించుకొని జట్టులోకి వచ్చాడు. ఆపరేషన్ తర్వాత విశ్రాంతి తీసుకొన్న తర్వాత ఆడుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ అదే. అప్పటికే సస్సెక్స్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడి ఫిట్‌నెస్ సాధించా" అని వివరించాడు.