తెలంగాణ

telangana

ETV Bharat / sports

Rohit Sharma: 'నా జీవితంలో అదే అతిపెద్ద నిర్ణయం'

టెస్టుల్లో తన బ్యాటింగ్​ ఆర్డర్ మార్చినప్పుడు అదే తన చివరి అవకాశమని భావించినట్లు రోహిత్ శర్మ చెప్పాడు. తనను ఓపెనింగ్​ చేయమని చెప్పినప్పుడు పెద్దగా ఆశ్చర్యపోలేదని అన్నాడు.

Rohit Sharma
రోహిత్ శర్మ

By

Published : Sep 5, 2021, 9:30 PM IST

2019లో టెస్టుల్లో ఓపెనింగ్​ చేయాలనుకోవడం క్రికెటర్​గా తన జీవితంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయమని టీమ్​ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma Test) చెప్పాడు. అప్పటికే ఈ ఫార్మాట్​లో అది తనకు చివరి అవకాశమని, కాబట్టి రిస్క్​ చేసినట్లు వెల్లడించాడు.

"ఓపెనింగ్ చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు నేను మానసికంగా సిద్ధంగానే ఉన్నాను. మిడిల్​ ఆర్డర్​లో ఆశాజనక ప్రదర్శన చేయలేదు. ఇదే నా చివరి అవకాశమని అర్థమైంది. క్రీడల్లో అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. రిస్క్​ తీసుకోవాలి. కాబట్టి ఓపెనర్​ అనే మార్పు నాకు పెద్ద సర్​ప్రైజ్​లా అనిపించలేదు. ఒకవేళ నేను విఫలమై ఉంటే అదే నా ఆఖరి అవకాశమై ఉండేది. ఓపెనర్​గా నాకు దీర్ఘకాల భవిష్యత్ ఉంటుందని యాజమాన్యం చెప్పింది. నేను మాత్రం అలా అనుకోలేదు"

- రోహిత్ శర్మ, టీమ్​ఇండియా ఓపెనర్

ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టులో అసమాన ప్రదర్శనతో శతకం చేసిన హిట్​మ్యాన్.. విదేశాల్లో తొలి టెస్టు సెంచరీ నమోదు చేశాడు.

ఇదీ చూడండి:

KL రాహుల్​కు జరిమానా- మ్యాచ్​ ఫీజులో కోత

IND Vs ENG: రోజంతా ఆడిన బ్యాట్స్​మెన్​.. టీమ్​ఇండియా ఆధిక్యం 171

ABOUT THE AUTHOR

...view details