శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్‌ను 2-1తో విజయవంతంగా గెలుపొందింది ధావన్ సేన. తొలి రెండు మ్యాచ్‌ల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన టీమ్ఇండియా.. చివరి వన్డేలో ప్రయోగాలకు తెరలేపింది. ఏకంగా ఐదుగురు కుర్రాళ్లను అరంగేట్రం చేయించింది. ఇప్పుడు టీ20ల వంతు వచ్చింది. నేటి నుంచి పొట్టి సిరీస్ ప్రారంభమవుతుంది.
ఫామ్‌లో టీమ్ఇండియా..
తొలి మ్యాచ్‌లో 263 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.4 ఓవర్లలో ఛేదించింది భారత్. ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా, అరంగేట్ర ఆటగాడు ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. పృథ్వీ, సూర్యకుమార్ వీలైనంత ఫాస్ట్‌గా ఆడారు. ఉత్కంఠగా మారిన రెండో మ్యాచ్‌లో 276 పరుగుల లక్ష్యాన్ని చివరి ఓవర్లో ఛేదించింది టీమ్ఇండియా. సూర్యకుమార్ హాఫ్ సెంచరీకి తోడు మనీష్ పాండే, కృనాల్ పాండ్య ఫర్వాలేదనిపించారు. చివర్లో దీపక్ చాహర్ తన కెరీర్ ఆసాంతం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అద్భుత అర్ధ శతకంతో జట్టును ముందుండి గెలిపించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు.
లంకను తక్కువ చేయలేం..
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఎటువంటి ప్రయోగాలకు తావివ్వకుండా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది పర్యటక జట్టు. భారత జట్టులో చాలామందికి ఐపీఎల్ ఆడిన అనుభవం ఉండగా.. ఆతిథ్య జట్టు ఎలా ఆడానుందో చూడాలి. తొలి వన్డేలో ఘోరంగా ఓడిన లంకేయులకు గెలుస్తామనుకున్న రెండో మ్యాచ్‌ను చాహర్ లాగేసుకున్నాడు. చివరి మ్యాచ్‌లో గెలిచి కనీసం పరువు నిలుపుకున్నారు. ఓపెనర్ ఫెర్నాండోతో పాటు భానుక రాజపక్స, కరుణరత్నే, అసలంక ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో హసరంగ, జయవిక్రమే, అకిల ధనంజయ ఫర్వాలేదనిపించారు.
ఈ సిరీస్ కీలకం..