తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత్ ఏం చెబితే అదే.. ప్రపంచ క్రికెట్​ను అలా శాసిస్తోంది' - ipl media rights 2023

ప్రపంచ క్రికెట్​పై భారత క్రికెట్ బోర్డు ఆధిపత్యం చెలాయిస్తోందని అన్నాడు పాకిస్థాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది. ఐపీఎల్​ను సుదీర్ఘంగా నిర్వహించడం వల్ల ఇతర అంతర్జాతీయ టోర్నీలపై ప్రభావం పడుతోందని చెప్పాడు.

Shahid Afridi
ipl latest news

By

Published : Jun 21, 2022, 8:42 PM IST

ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ కీలక పాత్ర పోషిస్తోందని.. అది ఏం చెబితే అదే జరుగుతుందని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్‌పై భారత క్రికెట్‌ బోర్డు ఆధిపత్యం చలాయిస్తోందని అన్నాడు. గతనెల పూర్తయిన భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ రెండు నెలల పాటు జరగడంతో రాబోయే రోజుల్లో అది అంతర్జాతీయ టోర్నీలపై ప్రభావం చూపుతుందని విమర్శలు చేశాడు. భారత్‌లో క్రికెట్‌కు విశేషమైన ఆదరణ ఉందని, దీంతో అక్కడి మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ తగినంత ఆదాయం ఆర్జిస్తోందని.. అందువల్లే అది ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తోందని అభిప్రాయపడ్డాడు.

మరోవైపు ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్‌ ప్రసార హక్కులు రికార్డు స్థాయిలో రూ.48,390 కోట్లకు అమ్ముడుపోవడంతో అఫ్రిది అక్కస్సుతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రసారహక్కుల వేలం అనంతరం బీసీసీఐ స్పందిస్తూ దేశంలో ఈ ఆటకున్న ఆదరణ కారణంగానే ఇంత మొత్తం ఆదాయం లభించిందని స్పష్టం చేసింది. అయితే, ప్రస్తుతం పది జట్లతో 74 మ్యాచ్‌లు నిర్వహిస్తున్న ఈ టోర్నీని రాబోయే సీజన్లలో 84, 94లకు పెంచుతామని వెల్లడించింది. దీంతో ఈ టోర్నీ కోసం బీసీసీఐ సుమారు మూడు నెలల విండోను ప్రత్యేకంగా కేటాయించనుందని, అందుకోసం అన్ని దేశాల క్రికెట్‌ బోర్డులను ఒప్పిస్తామని చెప్పింది.

ఇదీ చూడండి:టాప్​ 10లో భారత్​ నుంచి స్మృతి మంధాన మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details