What is Yo Yo Test : ఆటగాళ్లు పూర్తిగాఫిట్నెస్సాధిస్తేనే మైదానంలో చురుగ్గా కదలగలరు. మరి వారు ఎంత ఫిట్‌గా ఉన్నారని తెలుసుకోవాలంటే ఓ పరీక్ష పెట్టాలి కదా..అలాంటిదే ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో ట్రెండ్ అవుతున్న యో-యో టెస్టు. 2018లో మొదలైన ఈ టెస్టు మధ్యలో కాస్త విరామం తీసుకుంది. రానున్న ఆసియా కప్, వరల్డ్ కప్ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఈ టెస్టును బీసీసీఐ నిర్వహిస్తోంది. ఇంతకీ ఈ యోయో ఏంటంటే..
అంతర్జాతీయ క్రికెట్లో ఉండే కాంపిటిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో పోటీ పడాలంటే.. ఒక్క స్కిల్, ఫామ్ మాత్రం ఉంటే సరిపోదు. అక్కడి ప్లేయర్స్‌కు దీటుగా పోరాడాలంటే మంచి ఫిట్నెస్ కూడా ఉండాల్సిందే. ఇదే భారత క్రికెట్ జట్టును నడిపించే మేనేజ్మెంట్ ఉద్దేశం కూడా. అందుకే అయిదేళ్ల కిందట యోయో అనే ఓ ఫిట్నెస్ పరీక్షను ప్రవేశ పెట్టి.. ప్రతి ఆటగాడూ అందులో పాసవ్వడం తప్పనిసరి అన్నట్లు ఓ నిబంధన పెట్టారు.
Yo Yo Test Indian Team : ఒకప్పటి స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ శంకర్ బసునే ఈ టెస్ట్‌లను టీమ్ఇండియాకు పరిచయం చేసింది. అయితే భారత క్రికెట్లో అత్యున్నత ఫిట్నెస్ ప్రమాణాలను నెలకొల్పిన రన్నింగ్ మెషిన్విరాట్ కోహ్లి అప్పటి టీమ్ఇండియా కెప్టెన్‌గా ఉండటం వల్ల యోయోకు సులువుగానే ఓకే చెప్పేశారు.ఇక అప్పటి కోచ్ రవిశాస్త్రి కూడా ఈ నిర్ణయాన్ని ఫుల్‌గా సపోర్ట్ చేశారు. అలా 2018 నుంచి దాదాపు మూడేళ్ల పాటు ఈ టెస్టులు విజయవంతంగా జరిగింది.
యోయోలో పాసవ్వడం అనేది అనేది టీమ్ఇండియా ఆటగాళ్లకు తప్పనిసరి టాస్క్‌గా మారింది. అయితే అత్యుత్తమ ఫిట్నెస్ ఉంటే తప్ప యోయోను అధిగమించడం సాధ్యం కాదు. ఇక యువరాజ్ సింగ్, సురేశ్ రైనా లాంటి సీనియర్లే కాదు.. వాషింగ్టన్ సుందర్, పృథ్వీ షా లాంటి యంగ్ ప్లేయర్లు సైతం ఈ పరీక్షను అధిగమించలేక ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి.
ఇక కోహ్లి కెప్టెన్‌గా ఉన్నంత కాలం ఈ పరీక్షను కఠినంగానే అమలు చేశారు. అయితే అతను ఒక్కో ఫార్మాట్లో కెప్టెన్సీకి దూరం కావడం, మరోవైపు కరోనా ప్రభావం వల్ల ఆటగాళ్ల ఫిట్నెస్ ప్రమాణాలు తగ్గాయి. దీంతో యోయో మీద పూర్తిగా దృష్టిపెట్టే పరిస్థితి కూడా లేకపోయింది. ఇక కెప్టెన్‌తో పాటు కోచింగ్ సిబ్బంది కూడా మారడం వల్ల ఈ టెస్టును పక్కన పెట్టేశారు.
Yo Yo Test Eligibility Points : తాజాగా మళ్లీ యోయోకు పూర్వ వైభవం సంతరించుకుంది. వన్డే ప్రపంచకప్ సమీపిస్తుండటం వల్ల ఆసియా కప్‌కు మందే జట్టు సభ్యులకు యోయో టెస్ట్ నిర్వహించాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకుంది. దీంతో ఈ విషయాన్ని ఇప్పుడు తప్పనిసరి చేశారు. గతంలో దీంట్లో పాస్ అవ్వలంటే ప్లేయర్స్.. 16.1 పాయింట్లను కచ్చితంగా సాధించాల్సిందే. అయితే ఇప్పుడు అది కాస్త 16.5కు పెరిగింది.