తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్ఇండియాకు కొత్త కెప్టెన్.. బీసీసీఐ వ్యూహమేంటి?

టీమ్ఇండియా టీ20 కెప్టెన్​(team india t20 captain)గా తన చివరి మ్యాచ్ ఆడేశాడు విరాట్ కోహ్లీ(virat kohli news). దీంతో ఇతడి తర్వాత పొట్టి ఫార్మాట్​లో సారథ్య బాధ్యతలు ఎవరికి అప్పజెప్పుతారా? అన్న ప్రశ్న ప్రతి అభిమానిలోనూ మెదులుతోంది. ఇందుకోసం రోహిత్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నా.. అది తాత్కాలికమే! అని విశ్లేషకులు అంటున్నారు.

Team India
టీమ్ఇండియా

By

Published : Nov 9, 2021, 8:11 AM IST

విరాట్ కోహ్లీ 2023 ప్రపంచకప్‌(odi world cup 2023) వరకు ఉంటాడా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమే. కానీ ప్రస్తుతానికి టీ20 జట్టు కెప్టెన్‌(team india t20 captain) సీటు మాత్రమే ఖాళీ అయింది. కాబట్టి ఈ ఫార్మాట్లో కోహ్లీ వారసుడు ఎవరు అన్నదే ఇప్పుడు ఆసక్తి కలిగించే అంశం. తాత్కాలిక ప్రాతిపదికన చూసుకుంటే రోహిత్‌(rohit sharma news) పేరే ముందు వరుసలో ఉంటుంది. పొట్టి క్రికెట్లో సారథిగా అతడికి మంచి రికార్డే ఉంది. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ను 5 సార్లు విజేతగా నిలిపిన ఘనత అతని సొంతం. కోహ్లీ నుంచి అతడు టీ20 పగ్గాలు(team india t20 captain) అందుకునే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. కానీ ఇది తాత్కాలిక ఏర్పాటేనా? ఒకవేళ కొత్త వన్డే కెప్టెన్‌ను నియమించాల్సి వస్తే ఆ బాధ్యతలు కూడా అతడికే అప్పగిస్తారా అన్నది ప్రశ్న.

వయసు సమస్య!

రోహిత్‌(rohit sharma news)కు ఇప్పుడు 34 ఏళ్లు. కోహ్లీ శుక్రవారమే 33వ ఏట అడుగుపెట్టాడు. టెస్టు, వన్డే జట్లలోని సీనియర్ల సగటు వయసు 33-34 ఏళ్లు. 2023 ప్రపంచకప్‌ నాటికి వాళ్ల వయసు మరింత పెరుగుతుంది. కరోనా పూర్తిగా కనుమరుగయ్యేంత వరకు బయో బబుల్‌ వాతావరణంలో ఆడక తప్పకపోవచ్చు. ప్రపంచకప్‌(odi world cup 2023)కు ముందు ఎక్కువ సంఖ్యలో వన్డే మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. సుదీర్ఘ కాలం బుడగలో ఆడుతూ అలసిపోకుండా ఉండడం సీనియర్లకు సాధ్యమేనా? ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ లేదా రోహిత్‌ జట్టును నడిపించగలరా? సారథ్యం వారి బ్యాటింగ్‌పై ప్రభావం చూపదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

భిన్న సారథ్యం వైపు చూపు!

భిన్న సారథ్యం భారత్‌కు నప్పుతుందా? అన్నది మరో ముఖ్యమైన ప్రశ్న. ఒక జట్టుకు కోహ్లీ(virat kohli news).. మరో జట్టుకు రోహిత్‌ నాయకత్వం వహిస్తే జట్టులో గ్రూపులు తయారవుతాయేమోనన్న అనుమానాలు కూడా లేకపోలేదు! అయితే ఇద్దరూ సీనియర్లే కాకుండా ఒక సీనియర్‌, ఒక జూనియర్‌కు రెండు జట్ల బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. 2014లో ధోనీ టెస్టు సారథ్యాన్ని విరాట్‌కు అప్పగించాడు. సుమారు ఏడాది పాటు వన్డేలు, టీ20 జట్లకు కెప్టెన్‌గా కొనసాగాడు. సీనియర్‌, జూనియర్‌ కావడం వల్ల ధోనీ(ms dhoni news).. కోహ్లీల మధ్య విభేదాలు తలెత్తలేదు. నాయకత్వ బదిలీ సాఫీగా సాగిపోయింది. అలాంటి వ్యూహమే అనుసరిస్తే మాత్రం యువ ఆటగాడికి భారత టీ20 జట్టు పగ్గాలు అప్పగించొచ్చు. తర్వాత వన్డే జట్టు నాయకత్వాన్ని కూడా అప్పజెప్పొచ్చు. ఈ బాధ్యతకు రాహుల్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

ఇవీ చూడండి: కోహ్లీ-శాస్త్రి కాంబో.. అద్వితీయ విజయాలకు కేరాఫ్

ABOUT THE AUTHOR

...view details