West Indies Tour Of India: వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు అహ్మదాబాద్ చేరుకుంది. ఆటగాళ్లందరూ ఆదివారం, సోమవారం బయో బబుల్‌లోకి ప్రవేశించారని.. జట్టు సభ్యులందరూ మూడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారని బీసీసీఐ అధికారులు తెలిపారు.
తొడ కండరాల గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా తొలి సిరీస్ ఆడనున్నాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తిరిగి జట్టులో చోటు సంపాందించగా.. రవి బిష్ణోయ్ అరంగేట్రం చేయనున్నాడు.
స్వదేశంలో ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్ కైవసం చేసుకున్న వెస్టిండీస్ జట్టు.. వచ్చే వారం అహ్మదాబాద్ చేరుకోనుంది.