West Indies Captain Shai Hope Abou Ms Dhoni :టీమ్ఇండియా మాజీ సారథి ఎమ్ఎస్ ధోనీపై వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ చెప్పిన స్ఫూర్తిదాయకమైన విషయాలే వన్డే ఫార్మాట్లో తాను రాణించడానికి సహాయం చేశాయని తెలిపాడు. మ్యాచ్ తర్వాత అతడి బ్యాటింగ్ ప్రదర్శనపై అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు హోప్.
'చాలా చాలా ఫేమస్ వ్యక్తి ఎమ్ఎస్ ధోనీతో నేను కొన్నాళ్ల క్రితం ముచ్చటించాను. మాటల్లో ఆయన - 'నువ్వు అనుకున్న దాని కంటే నీకు ఎక్కువ సమయం ఉంది' అని నాతో చెప్పారు. ఇన్నేళ్లుగా నేను వన్డే క్రికెట్ ఆడుతున్నంత కాలం ఆ ఒక్క విషయం నా మైండ్‌లో అలాగే స్ట్రక్ అయిపోయింది' అని షై హోప్ వివరించాడు.
ఇదిలా ఉండగా.. క్వాలిఫై కాలేక వరల్డ్ కప్‌నకు దూరమైన వెస్టిండీస్ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో షై హోప్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి (83 బంతుల్లో 109*) సెంచరీ పూర్తి చేశాడు. చివరగా మూడు సిక్స్‌లు బాది మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.
England Vs West Indies Odi 2023 : మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్ పర్యటనకు వచ్చింది ఇంగ్లాండ్ . ఆంటిగ్వాలోని సర్ వీవీ రిచర్డ్స్ స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులు చేసి ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ (71), చాగ్ క్రావ్లే (48), సాల్ట్ (45), సామ్ కరణ్ (38) రాణిచారు. వెస్టిండీస్ బౌలర్లు రొమానియో షెఫర్డ్, మోటీ, ఒషేన్ థామస్ తలో రెడు వికెట్లు తీయగా.. జోసెఫ్, వై క్యారియా చెరో వికెట్లు పడగొట్టారు.
ఆ తర్వాత 326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 48.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి. టార్గెట్ ఛేదించింది. షై హోప్ (109) సెంచరీతో దూసుకెళ్లాడు. అలిక్ అథనేజ్ (66), రొమారియో షెఫర్డ్ (49) రాణించారు. గస్ ఆత్కిసన్ 2, రెహాన్ అహ్మద్ 2, బ్రైడన్ కార్స్ 1, లివింగ్‌స్టోన్ 1 వికెట్ తీశారు.
ఆఖరి పంచ్ 'భారత్'దే - 4-1 తేడాతో సిరీస్ కైవసం
వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఆతిథ్యానికి భారత్ బిడ్- ఒలింపిక్స్ నిర్వహణకూ సై!