వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్(Nicholas Pooran) ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి అలిస్సా మిగ్యుయెల్ను వివాహం చేసుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ తమ పెళ్లి ఫొటోను పోస్ట్ చేశాడు. "దేవుడు నాకు ఎన్నో చేశాడు. నువ్వు(భార్య) నా జీవితంలో ఉండటం కంటే గొప్పది ఏదీ లేదు. మిస్టర్ అండ్ మిసెస్ పూరన్‌కు స్వాగతం" అంటూ వ్యాఖ్య రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా అనిల్ కుంబ్లే, జాసన్ హోల్డర్, పొలార్డ్ సహా పలువురు క్రికెటర్లు పూరన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రేయసిని పెళ్లాడిన నికోలస్ పూరన్ - ipl crikceter nicolas pooran
వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్(Nicholas Pooran) తన ప్రేయసి అలిస్సా మిగ్యుయెల్ను వివాహం చేసుకున్నాడు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా అతడికి పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
నికోలస్
పూరన్.. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కెరీర్లో ఇప్పటివరకు 28వన్డేలు(982 పరుగులు), 27 టీ20లు(392), 28 ఐపీఎల్ మ్యాచ్‌లు(549) ఆడాడు. దేశంలో కరోనా రెండోదశ వేగంగా వ్యాపిస్తున్న వేళ తన వంతుగా.. ఈ మెగాలీగ్‌లో(IPL) ఆడిన మ్యాచ్‌ల ద్వారా వచ్చిన జీతంలో కొంతభాగాన్ని విరాళంగా ఇచ్చాడు.
ఇదీ చూడండి: కరోనా బాధితుల కోసం ఐపీఎల్ జీతమిచ్చేసిన క్రికెటర్