డబ్ల్యూటీసీ ఫైనల్లో బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఛెతేశ్వర్ పుజారాకు మద్దతుగా నిలిచాడు క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. కివీస్ కూడా ఎలా బ్యాటింగ్ చేసిందో గుర్తు చేసుకోవాలని సూచించాడు.
"సౌథాంప్టన్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదు. పరిస్థితులు బౌలింగ్‌కు కలిసొచ్చాయి. ప్రతి బ్యాట్స్‌మన్ తొలుత క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నించారు. న్యూజిలాండ్ జట్టులోనూ కాన్వే, విలియమ్సన్, రాస్ టేలర్.. క్రీజులో ఉన్నంతసేపు డిఫెన్స్‌కు ప్రయత్నించారు. అందుకోసం చాలా బంతుల్ని వారు వృథా చేశారు. పుజారా కూడా అలాగే చేశాడు. అయినా మీరు పుజారాను మాత్రమే నిందించాలనుకుంటే.. దానికి మేమేం చేయలేం."
-సునీల్ గావస్కర్, భారత క్రికెట్ దిగ్గజం.