ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)ఫైనల్‌లో భారత్ మ్యాచ్‌పై పట్టుబిగించాలంటే ముందుగా బౌలర్లు వీలైనంత తొందరగా కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను ఔట్ చేయాలని టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్ అభిప్రాయపడ్డాడు. ఇలా చేయడం వల్ల భారత్‌కు ఎంతో ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నాడు.
"న్యూజిలాండ్ పటిష్టమైన జట్టు. వారి బ్యాటింగ్ లైనప్ బాగుంది. కివీస్ బౌలర్లు చాలా అనుభవజ్ఞులే కాకుండా ప్రమాదకరమైనవారు. కాబట్టి వారితో జరిగే ఈ పోరు కఠినంగానే ఉంటుంది. ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడటం మాకు పెద్ద సవాలే. అది కూడా న్యూజిలాండ్ లాంటి జట్టుతో ఆడటం. టెస్టు ఆటగాళ్లు ఎంతో క్రమశిక్షణతో ఆడాలి. ప్రతి సెషన్‌లో దాన్ని కొనసాగించిన జట్టే విజేతగా నిలుస్తుంది. విలియమ్సన్ ఆటతీరు గురించి మాకు మంచి అవగాహన ఉంది. అతడు మంచి బ్యాట్స్‌మన్. అయితే, ఎంత గొప్ప ఆటగాడైనా ఓ మంచి బంతికి ఔట్ కావొచ్చు. మన సామర్థ్యాలను నమ్ముకుని వికెట్లు రాబట్టగలిగే బంతులనే ఎక్కువగా వేయాలి. విలియమ్సన్‌ను సాధ్యమైనంత త్వరగా ఔట్ చేయడం వల్ల టీమ్ఇండియాకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది"