శ్రీలంక క్రికెట్ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉందని, వెంటనే తగు చర్యలు తీసుకుని కాపాడాలని మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య బోర్డుకు సూచించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న లంక జట్టు మూడు టీ20ల సిరీస్‌లో ఒక్కటి కూడా గెలవలేకపోయింది. మరీ ముఖ్యంగా ఆఖరి మ్యాచ్‌లో ఆ జట్టు 181 పరుగుల లక్ష్య ఛేదనలో 91 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఇంగ్లాండ్ 89 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి తమ చరిత్రలో పరుగుల తేడా పరంగా నాలుగో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే జయసూర్య ఆదివారం ట్వీట్ చేశాడు.
Jayasuriya: 'లంక జట్టు పరిస్థితి దారుణం' - శ్రీలంక క్రికెట్ జయసూర్య
శ్రీలంక క్రికెట్ జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు ఆ జట్టు మాజీ ఆటగాడు సనత్ జయసూర్య. వెంటనే బోర్డు తగిన చర్యలు తీసుకోవాలని సూచించాడు.
"శ్రీలంక క్రికెట్‌కు ఇది చాలా బాధాకరమైన రోజు. ఇప్పుడున్న జట్టు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆటను కాపాడాలంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి" అని జయసూర్య విచారం వ్యక్తం చేశాడు.
ఈ పర్యటనలో శ్రీలంక ఏ మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్‌కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. తొలి టీ20లో 129/7 స్కోర్ చేసిన ఆ జట్టు.. రెండో టీ20లో 111/7 పరుగులు సాధించింది. మూడో మ్యాచ్‌లో 91 పరుగులకే ఆలౌటవ్వడంపై అభిమానులు విమర్శిస్తున్నారు. ఇలాగే ఆడితే ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్‌లోనూ ఘోర పరాజయాలు చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.