తెలంగాణ

telangana

ETV Bharat / sports

Virat Kohli News: దుబాయ్‌లో కోహ్లీ మైనపు విగ్రహం

టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీకి(Virat Kohli News) అరుదైన గౌరవం లభించింది. టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021)​ సందర్భంగా దుబాయ్​లోని మ్యూజియంలో కోహ్లీ మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం విశేషం.

virat kohli
విరాట్ కోహ్లీ

By

Published : Oct 19, 2021, 7:18 PM IST

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీకి(Virat Kohli Statue) మరోసారి అరుదైన గౌరవం దక్కింది. మేడమ్‌ టుస్సాడ్‌ సంస్థ.. దుబాయ్‌లోని మ్యూజియంలో కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది. టీమ్ఇండియా(Captain Kohli News) జెర్సీలో కోహ్లీ విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోంది. టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2021) మెగా టోర్నీ యూఏఈలోనే జరగనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న కోహ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇలా కోహ్లీ మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం ఇది రెండోసారి. 2019 వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా కూడా కోహ్లీ మైనపు విగ్రహాన్ని లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఉన్న మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో సందర్శనకు ఉంచారు.

కాగా, పొట్టి ప్రపంచకప్‌ సన్నాహకాలను టీమ్‌ఇండియా అదరగొట్టింది. సోమవారం ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో కోహ్లీ సేన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అక్టోబరు 20న టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వార్మప్‌ మ్యాచ్ జరగనుంది. అక్టోబరు 24న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.

ABOUT THE AUTHOR

...view details