జెంటిల్మన్ గేమ్‌గా పిలుచుకునే క్రికెట్లో తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ, ఉద్దేశపూర్వకంగా మైదానంలో నియంత్రణ కోల్పోయి ప్రవర్తించడం చాలా అరుదు. శుక్రవారం ఢాకా టీ20 లీగ్‌లో షకిబుల్ హసన్ ఇలాగే వ్యవహరించాడు. ఒకసారి కాదు రెండుసార్లు కాస్త అతి చేశాడు. ఈ దృశ్యాలు చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
అసలేం జరిగింది?
లీగ్‌లో భాగంగా మహమ్మదీయన్ స్పోర్టింగ్ క్లబ్(ఎంఎస్సీ), అబహానీ లిమిటెడ్(ఏఎల్) మధ్య మ్యాచ్ జరిగింది. ఎంఎస్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్న షకిబుల్.. ఏఎల్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్‌కు బంతి వేశాడు. ఎల్బీ కోసం అంపైర్‌కు అప్పీల్ చేయగా.. అతడు నాటౌట్‌గా ప్రకటించాడు. అంతే ఆగ్రహానికి లోనైన హసన్.. వికెట్లను కాళ్లతో తన్నాడు.
మరికొద్దిసేపటికి పవర్‌ప్లే ఓవర్ల సందర్భంగా మరోసారి అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు షకిబుల్. ఈ సారి నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న మూడు వికెట్లను చేతులతో తీసి గ్రౌండ్‌పై కొట్టాడు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఐపీఎల్ సందర్భంగా షకిబుల్‌పై ఐసీసీ విధించిన నిషేధం ఇటీవలే ముగిసింది.