ఖాళీ దొరికినప్పుడల్లా భార్యతో కలిసి సరదాగా గడపడం, డ్యాన్స్ చేయడం వంటివి చేస్తూ వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు టీమ్ఇండియా క్రికెటర్ కృనాల్ పాండ్యా. ఇటీవల శ్రీలంక సిరీస్ ఆడిన పాండ్యా.. ప్రస్తుతం అతడి భార్య పంఖూరి శర్మతో కలిసి జాలీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ జంట టెర్రస్‌పై సూపర్‌హిట్ సాంగ్ 'లెవిటేటింగ్'కు రొమాంటిక్‌గా స్టెప్పులు వేశారు.
దీనికి సంబంధించిన వీడియోను పంఖూరి ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. అభిమానులు విపరీతంగా లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు. హార్దిక్ పాండ్యా-నటాషా జోడీ కూడా హార్ట్ ఎమోజీలను కామెంట్‌గా పెట్టారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..