తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పాక్​ కోచ్​గా చేసేందుకు నేను మూర్ఖుడిని కాదు'

పాకిస్థాన్​ సూపర్ లీగ్​తో పాటు ఐపీఎల్​లోనూ పలు జట్లకు బౌలింగ్ కోచ్​గా పనిచేసిన మాజీ క్రికెటర్ వసీమ్​ అక్రమ్​.. తమ జాతీయ జట్టుకు కోచ్​గా పనిచేయడానికి మాత్రం నిరాకరిస్తున్నాడు. అన్ని తెలిసి కూడా ఆ పని చేయడానికి తానేమీ మూర్ఖుడిని కాదని పేర్కొన్నాడు.

wasim akram, former pakisthan captain
వసీమ్ అక్రమ్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్

By

Published : May 29, 2021, 5:30 AM IST

గతంలో పీఎస్​ఎల్​తో పాటు ఐపీఎల్​​లోనూ పలు జట్లకు బౌలింగ్ కోచ్​గా పనిచేసిన మాజీ క్రికెటర్​ వసీమ్ అక్రమ్​.. తమ జాతీయ జట్టుకు మాత్రం కోచ్​గా ఉండనంటున్నాడు. అన్నీ తెలిసి కోచ్​గా చేయడానికి తానేమీ మూర్ఖుడిని కాదని వింత సమాధానం చెప్పాడు. ​ఆ విషయాన్ని ఆలోచించడానికి కూడా నిరాకరించాడు.

"జట్టు ఓడిపోయిందంటే చాలు ఆటగాళ్లతో పాటు కోచ్​లను కూడా నిందిస్తారు అభిమానులు. సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రోల్స్ చేస్తారు. అనుచితంగా ప్రవర్తిస్తారు. ఇవన్నీ తెలిసి కూడా కోచ్​గా పనిచేయడానికి నేను మూర్ఖుడిని కాదు. కోచ్​.. జట్టు విజయాలకు సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తాడు. అతడు ఆటలో పాల్గొనడు. ఆటగాళ్లు మాత్రమే ఆడుతారు. వీటన్నిటికి భయపడి నేను దూరంగా ఉంటున్నాను. దుష్ప్రచారం లేకుండా ఆటను ప్రేమించినంత కాలం అభిమానులంటే ఇష్టమే ఉంటుంది."

-వసీమ్ అక్రమ్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్.

ఒకవేళ కోచ్​గా పనిచేస్తే ఏడాదిలో 200-250 రోజులు వారికి సమయం కేటాయించాలి. చాలా పని ఉంటుంది. పాకిస్థాన్​తో పాటు కుటుంబానికి దూరంగా ఉండి ఈ పనులన్నీ నేను చేయలేను. పాకిస్థాన్​ సూపర్​ లీగ్​లోని ఎక్కువ మంది ఆటగాళ్లతో ఉండటం కూడా ఒక కారణం అని అక్రమ్​ పేర్కొన్నాడు.

2004లో అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు ప్రకటించిన వసీమ్.. 2010 వరకు వ్యాఖ్యతగా పనిచేశాడు. ఆ తర్వాత కోల్​కతా నైట్​ రైడర్స్​తో పాటు పాకిస్థాన్​ క్రికెట్ లీగ్​లోని పలు ఫ్రాంఛైజీలకు బౌలింగ్ కోచ్​గా ఉన్నాడు.

ఇదీ చదవండి:''ఫ్రీ హిట్'​ లాగే బౌలర్లకూ 'ఫ్రీ బాల్' ఉండాలి'

ABOUT THE AUTHOR

...view details