Washington Sundar Replacement: కొవిడ్ కారణంగా దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉండగా అతడికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో జట్టుకు దూరమైన వాషింగ్టన్ స్థానంలో జయంత్ యాదవ్‌ను ఎంపిక చేసింది సీనియర్ సెలక్షన్ కమిటీ.
మరోవైపు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డాడు. దీంతో వన్డే సిరీస్‌లో అతడికి బ్యాకప్‌గా యువ ఆటగాడు నవదీప్ సైనీని ఎంపిక చేసింది సెలక్షన్ ప్యానెల్.
జనవరి 19 నుంచి టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది.
టీమ్ఇండియా వన్డే జట్టు..