తెలంగాణ

telangana

ETV Bharat / sports

సుందర్​ కోసం తండ్రి త్యాగం.. ఏం చేశారంటే? - ఇంటికి దూరంగా వాషింగ్టన్ సుందర్ తండ్రి

యువ ఆటగాడు వాషింగ్టన్‌ సుందర్‌ కలను నెరవేర్చేందుకు అతడి తండ్రి ఎం.సుందర్‌ కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడికి కొవిడ్‌-19 సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అతడికి దూరంగా మరో ఇంట్లో బస చేస్తున్నారు.

Washington Sundar
వాషింగ్టన్‌ సుందర్‌

By

Published : May 19, 2021, 12:30 PM IST

టీమ్ఇండియా యువ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌ తండ్రి ఎం.సుందర్ చెన్నై ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో పనిచేస్తారు. ఉద్యోగ రీత్యా వారంలో రెండుమూడు సార్లు ఇంటి గడప దాటక తప్పదు. ఈ నేపథ్యంలో తన ద్వారా కుమారుడికి కరోనా రాకూడదని ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారు. సుందర్‌ ఐపీఎల్‌ నుంచి తిరిగొచ్చినప్పటి నుంచి తల్లి, సోదరితో కలిసి ఉంటున్నాడు. తండ్రి మాత్రం మరో ఇంట్లో ఉంటూ వీడియో కాల్స్‌ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు.

"సుందర్‌ ఐపీఎల్‌ నుంచి తిరిగొచ్చినప్పటి నుంచి నేను మరో ఇంట్లో ఉంటున్నా. నా భార్య, కుమార్తె మాత్రం అతడితోనే ఉంటున్నారు. ఎందుకంటే వారు ఇంట్లోంచి బయటకు రారు. నేను వీడియో కాల్స్‌ ద్వారా వారితో మాట్లాడుతున్నా. వారంలో కొన్ని రోజులు నేను కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే సుందర్‌కు నా ద్వారా కొవిడ్‌ రాకూడదని కోరుకున్నా" అని ఎం.సుందర్‌ తెలిపారు.

2018లోనే సుందర్‌ ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపికయ్యాడు. ఒక్క మ్యాచులోనూ అతడికి అవకాశం రాలేదు. లార్డ్స్‌ సహా ఇంగ్లాండ్‌ మైదానాల్లో ఆడాలన్నది సుందర్‌ కోరికల్లో ఒకటి. ముంబయికి చేరుకొనేలోపు వైరస్ సోకితే విమానం ఎక్కే అవకాశం లేదని బీసీసీఐ స్పష్టం చేయడం వల్ల ఆటగాళ్లు మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో సుందర్‌ బ్యాటు, బంతితో రాణించాడు. అప్పట్నుంచి అతడు జట్టులో కీలక సభ్యుడు అయ్యాడు. దాంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌, ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీసుకు అతడిని ఎంపిక చేశారు.

ABOUT THE AUTHOR

...view details