డేవిడ్ వార్నర్ క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కరలేని పేరు. మైదానంలో మంచి ఆటతీరుతో అలరించే వార్నర్ సామాజిక మాధ్యమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. కొవిడ్ విజృంభణ సమయంలో ఖాళీగా ఉండకుండా పలు తెలుగు, హిందీ పాటలకు రీల్స్ చేసి అభిమానులకు మరింత చేరువయ్యాడు. వార్నర్ మాత్రమే కాకుండా అతని కుటుంబసభ్యులు సైతం పలు పాటలకు డైలాగ్‌లు, స్టెప్పులు వేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లను సంపాదించుకున్నారు.
'వార్నర్.. మీరు తెలుగు సినిమాల్లో నటించొచ్చుగా' - వార్నర్ తెలుగు సినిమాలో నటించాలంటూ సూచన న్యూస్
మైదానంలో పరుగుల వరద పారిస్తున్న.. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్, నటనతోనూ మరింత మందికి చేరువయ్యాడు. కొవిడ్ మహమ్మారి సమయంలో పలు తెలుగు, హిందీ పాటలు, డైలాగ్‌లకు రీల్స్ చేస్తూ తనలో మంచి నటుడున్నాడని నిరూపించాడు. వార్నర్ నటనకు ఫిదా అయిన ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ తాజాగా ట్విటర్ వేదికగా చేసిన సూచన ఆసక్తి రేకెత్తిస్తోంది.
తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ వార్నర్‌కు.. ఓ సూచన చేసింది. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వార్నర్ తెలుగు సినిమాల్లో నటించడాన్ని కెరీర్‌గా ఎంచుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇదే వార్నర్‌కు సరైన వేదిక అని ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన డేవిడ్ వార్నర్ నవ్వుతున్న ఎమోజీలను రీట్వీట్ చేశాడు.
ఇటీవల ప్రేక్షకులను బాగా ఆకట్టుకొన్న పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ గెటప్‌తోపాటు డీజే టిల్లూ రీల్స్ చేసి డేవిడ్ వార్నర్ అభిమానుల మనసు కొల్లగొట్టాడు. ఆటతో పాటు నటనతోనూ విజృంభిస్తున్నాడు. కెరీర్‌లో వందో టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన డేవిడ్ వార్నర్ ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాడు.
TAGGED:
David Warner latest news