IPL 2022 Warner: మరి కొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ నిర్వహణ కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులను నిరాశపరిచే ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లకు చాలా మంది విదేశీ ప్లేయర్లు అందుబాటులో ఉండట్లేదని తెలిసింది. వీరిలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, కగిసొ రబాడా(వెస్టిండీస్), అన్రిచ్ నోర్జే(దక్షిణాఫ్రికా), మార్కొ జాన్సన్(దక్షిణాఫ్రికా) ఉన్నారని తెలిసింది. అంతర్జాతీయ క్రికెట్ కోసం వీరు దూరం కానున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.
ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు ఆ స్టార్స్ దూరం! - వార్నర్
IPL 2022 Warner: ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు కొంతమంది విదేశీ స్టార్ ఆటగాళ్లు దూరం కానున్నట్లు తెలిసింది. ఇంతకీ ఆ ప్లేయర్స్ ఎవరంటే?
ఐపీఎల్ 2022
ఏప్రిల్ ప్రారంభంలో స్వదేశంలో ఐపీఎల్ నిర్వహించాలని బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఆ సమయంలో ఆస్ట్రేలియా.. పాకిస్థాన్‌తో, దక్షిణాఫ్రికా.. బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడనుంది. ఈ కారణంగా ఆ దేశ ఆటగాళ్లు తమ జట్టుకు అండగా ఉండేందుకు మెగాటోర్నీకి దూరంగా ఉండనున్నారని తెలిసింది. కాగా, ఈ సీజన్ కోసం ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా మెగావేలం నిర్వహించనున్నట్లు ఇటీవలే ప్రకటించింది బీసీసీఐ.
ఇదీ చూడండి: అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఫుట్‌బాల్ స్డేడియం!
Last Updated : Feb 10, 2022, 11:19 AM IST