తెలంగాణ

telangana

ETV Bharat / sports

14 రోజుల డైట్​ వల్లే వార్న్​ చనిపోయారా? - షేన్​ వార్న్​ ఇన్​స్టాగ్రామ్​ పోస్టు

shane warne news: ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్​ వార్న్​ మృతి.. యావత్ క్రికెట్​ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతికి కొన్ని క్షణాలకు ముందు ఏం జరిగిందో చెప్పిన వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్​కిన్​​.. ఇప్పుడు మరో విషయాన్ని వెల్లడించారు. అదేంటంటే?

షేన్​ వార్న్​
shane warne

By

Published : Mar 7, 2022, 12:55 PM IST

Updated : Mar 7, 2022, 3:03 PM IST

shane warne manager: స్పిన్‌ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ హఠాన్మరణంతో క్రికెట్‌ ప్రపంచం షాక్‌కు గురైంది. థాయ్‌లాండ్ విహారంలో ఉన్న షేన్ వార్న్ శుక్రవారం తన విల్లాలో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతికి ముందు చివరి క్షణాల్లో ఏం జరిగిందో వార్న్‌ మేనేజర్‌ జేమ్స్‌ ఎర్స్‌కిన్‌ బయటపెట్టాడు. అయితే ఇప్పుడు మరో విషయాన్ని వార్న్​ మేనేజర్​ తెలిపారు. థాయ్​లాండ్​కు వెళ్లే ముందు 14 రోజులు కేవలం ద్రవ ఆహారం తీసుకునే డైట్​ను వార్న్​ మొదలు పెట్టారని చెప్పారు. ఒక రోజు ఛాతి వద్ద నొప్పిగా ఉందని, చెమటలు పడుతున్నాయని వార్న్ ​చెప్పారని మేనేజర్​ ఎర్స్​కిన్​ తెలిపారు. సాధారణంగా వార్న్​ ఎక్కువగా సిగరెట్లు​ తాగుతారని ఎర్స్​కిన్​ అన్నారు. అందుకే అది గుండెపోటే అయి ఉంటుందని, ఇంకా వేరేది ఏం కాదన్నారు.

సహజ మరణమే..

వార్న్ మరణంలో అనుమానాస్పద సూచనలేమీ లేవని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని థాయ్​లాండ్ పోలీసులు తెలిపారు. శవపరీక్షలో కూడా సహజ కారణాల వల్లే వార్న్ మృతిచెందినట్లు స్పష్టమైందని వెల్లడించారు.

బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తున్నారని కొద్ది రోజుల ముందు వార్న్​ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశారు.

ఇదీ చదవండి: వార్న్ గదిలో రక్తపు మరకలు.. కారణం ఏంటి?

Last Updated : Mar 7, 2022, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details