తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ షాట్లు అద్భుతం.. అతడిని అడిగి నేనూ నేర్చుకుంటా' - రిషబ్​ పంత్​

Warner Pant: ఐపీఎల్​ 2022లో దిల్లీ క్యాపిటల్స్​ తరఫున ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాడు ఆసీస్​ ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​. లఖ్​నవూతో గురువారం జరిగే మ్యాచ్​లో ఆడే అవకాశముంది. అయితే.. దిల్లీ కెప్టెన్​ పంత్​ నుంచి సింగిల్​ హ్యాండెడ్​ షాట్లు ఎలా ఆడాలో నేర్చుకుంటానని చెబుతున్నాడు వార్నర్​.

Want to learn how to play one-handed shots from Rishabh: Warner
Want to learn how to play one-handed shots from Rishabh: Warner

By

Published : Apr 7, 2022, 7:40 AM IST

Warner Pant: దిల్లీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ నుంచి ఒక్క చేత్తో షాట్లు ఆడడం ఎలాగో నేర్చుకుంటానని అంటున్నాడు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్​ డేవిడ్‌ వార్నర్‌. 2009లో దిల్లీతోనే భారత్‌లో టీ20 క్రికెట్‌ లీగ్‌ కెరీర్‌ను ఆరంభించిన అతడు.. మధ్యలో హైదరాబాద్‌కు ఆడి, ఈ సంవత్సరమే ఆ జట్టులోకి తిరిగొచ్చాడు. గురువారం లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​తో మ్యాచ్‌ నుంచి అతడు జట్టుకు అందుబాటులో ఉంటాడు. ఈ సీజన్​లో ఇప్పటివరకు ఆడలేదు వార్నర్​.

''రిషబ్‌ పంత్‌ నుంచి ఒంటి చేత్తో ఎలా షాట్లు ఆడాలో నేర్చుకోవాలనుకుంటున్నా. అతడు కుర్రాడు. ఇప్పుడిప్పుడే నాయకత్వాన్ని వంటబట్టించుకుంటున్నాడు. పంత్‌ భారత జట్టులో అంతర్భాగం కూడా. అతడితో కలిసి బ్యాటింగ్‌ చేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా'' అని వార్నర్‌ ఓ ప్రకటనలో చెప్పాడు. దిల్లీ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌తో కలిసి పని చేయడం కూడా గురించి కూడా అతడు మాట్లాడాడు. ''దిల్లీ కోచ్‌గా రికీ బాగానే విజయవంతమయ్యాడు. కెప్టెన్‌గా అతడు ఆస్ట్రేలియాను గొప్పగా నడిపించాడు. ఇప్పుడు కోచ్‌గా కూడా చాలా గౌరవాన్ని పొందుతున్నాడు. అతడితో కలిసి పని చేయడం కోసం చూస్తున్నా.'' అని వార్నర్‌ చెప్పాడు.

ఐపీఎల్​ 2022 తన తొలి మ్యాచ్​లో ముంబయిపై గెలిచినా.. తర్వాత గుజరాత్​తో ఓడింది దిల్లీ క్యాపిటల్స్​. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. గురువారం లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​తో తలపడనుంది. ముంబయిలోని డీవై పాటిల్​ స్పోర్ట్స్​ అకాడమీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది. ఈ సీజన్​లో దిల్లీ తరఫున ఇంకా మ్యాచ్​ ఆడని సౌతాఫ్రికా పేసర్​ అన్రిచ్​ నోర్జేను కూడా ఇవాళ తుదిజట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:'ఆ ఒక్కటి జరగకపోయుంటే.. రోహిత్​కు ఎప్పుడో కెప్టెన్సీ'

యంగ్​ క్రికెటర్​, తెలుగు హీరోయిన్​ మధ్య సమ్​థింగ్​ సమ్​థింగ్?

ABOUT THE AUTHOR

...view details