న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ రాస్ టేలర్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 100కి పైగా మ్యాచ్లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. టెస్టుల్లో 108 మ్యాచ్లు ఆడి 7565 పరుగులు చేసిన టేలర్.. వన్డేల్లో 233 మ్యాచ్‌ల్లో 8576 రన్స్ చేశాడు. ఇక పొట్టి ఫార్మాట్లో 102 మ్యాచ్‌లాడిన ఈ మాజీ కెప్టెన్ 1909 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్‌ను గెలుపొందిన జట్టులో సభ్యుడైన ఈ 37 ఏళ్ల ఆటగాడు.. తన కెరీర్లో ఓ మేజర్ ఐసీసీ ట్రోఫీనీ అందుకున్నాడు.
ఊహాగానాలకు చెక్..
తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు టేలర్. ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం అతడు క్రికెట్‌కు వీడ్కోలు చెప్తాడని చాలా మంది భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా తాను ఆడాలనుకున్నంత వరకు క్రికెట్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు.
టీమ్ఇండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో కీలకమైన సమయంలో 47 పరుగులతో రాణించాడు టేలర్. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం మేనేజింగ్ ఐసోలేషన్‌లో ఉన్న టేలర్.. కుటుంబ సభ్యులను, స్నేహితులను కలవడానికి ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.