ప్రస్తుతం భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న కాన్పూర్ టెస్టు(IND vs NZ 1st Test 2021)లో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఈ రెండు జట్ల మధ్య వాంఖడే మైదానం(IND vs NZ 2nd Test Mumbai)లో డిసెంబర్ 3 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. తాజాగా ఈ స్టేడియంలో జరగబోయే మ్యాచ్‌కు వీక్షకులకు అనుమతించింది మహారాష్ట్ర ప్రభుత్వం. 25 శాతం ప్రేక్షకులు హాజరు కావచ్చొని తెలిపింది. ఈ విషయాన్ని ముంబయి క్రికెట్ అసోసియేషన్ అధికారులు వెల్లడించారు. ప్రేక్షకుల సామర్థ్యాన్ని 50 శాతం పెంచేలా నిర్ణయం తీసుకోమని ప్రభుత్వాన్ని కోరతామని వెల్లడించారు.
వాంఖడే టెస్టుకు ప్రేక్షకులకు అనుమతి.. సామర్థ్యం ఎంతంటే? - భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టు వీక్షకులు
భారత్-న్యూజిలాండ్ మధ్య వాంఖడే వేదికగా రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు 25 శాతం మంది ప్రేక్షకులకు అనుమతినిచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం.
"వాంఖడే స్టేడియంలో జరగబోయే భారత్-న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులకు అనుమతించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం 25 శాతం మందికి అనుమతి ఇచ్చారు. 50 శాతం సామర్థ్యాన్ని కల్పించాలని వారిని కోరతాం. దీనిపై నమ్మకంతో ఉన్నాం" అని ఓ అధికారి తెలిపారు.
ప్రస్తుతం కాన్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు(IND vs NZ 1st Test 2021)లో మూడు రోజు ఆటముగిసే సమయానికి భారత్ ఆధిపత్యంలో కొనసాగుతోంది. 129/0 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన కివీస్‌ను 296 పరుగులకే ఆలౌట్ చేయడంలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. అక్షర్ పటేల్ (5/62) కివీస్‌ను దెబ్బతీశాడు. అక్షర్‌కు తోడు అశ్విన్ (3/82) కీలకమైన సమయాల్లో వికెట్లు తీశాడు. కివీస్ ఓపెనర్లు లాథమ్ (95), విల్ యంగ్ (89) సెంచరీ సాధించకుండా అడ్డుకున్నారు. ఆఖర్లో జేమీసన్ (23) భారత బౌలర్లను పరీక్షించగా... మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. విలియమ్సన్ 18, రాస్ టేలర్ 11, నికోల్స్ 2, టామ్ బ్లండెల్ 13, రచిన్ రవీంద్ర 13, సౌథీ 5, సోమర్‌విల్లే 6, అజాజ్ పటేల్ 5* పరుగులు చేశారు. రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్ చెరో వికెట్ తీశారు. అనంతరం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది భారత్. ప్రస్తుతం టీమ్‌ఇండియా 63 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. క్రీజ్‌లో మయాంక్ అగర్వాల్ (4*), పుజారా (9*) ఉన్నారు.