తెలంగాణ

telangana

ETV Bharat / sports

Wanindu Hasaranga: 'కోహ్లీ వికెట్​ తీయాలనేదే నా కల' - శ్రీలంక బౌలర్ హసరంగ

Wanindu Hasaranga on Kohli: టీమ్​ఇండియా మాజీ సారథి విరాట్​ కోహ్లీ వికెట్ పడగొట్టడమే తన కల అని చెప్పాడు శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగ. ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంక ప్రీమియర్​లీగ్​ నేపథ్యంలో హసరంగ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

virat kohli
విరాట్ కోహ్లీ

By

Published : Dec 10, 2021, 10:12 PM IST

Wanindu Hasaranga on Kohli: శ్రీలంక స్పిన్నర్​ వానిందు హసరంగ లంక ప్రీమియర్​ లీగ్​లో సత్తాచాటుతున్నాడు. మూడు మ్యాచ్​ల్లోనే ఐదు వికెట్లు తీశాడు. టీ20 ప్రపంచకప్​లోనూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా నిలిచాడు హసరంగ. అయితే.. టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ వికెట్ తీయడమే తన లక్ష్యమని చెబుతున్నాడు వరల్డ్ టీ20 నంబర్ వన్ బౌలర్.

హసరంగ

"నా ఫేవరేట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టాలనేదే నా ఆశ. పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజామ్, ఆస్ట్రేలియా ఆల్​రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్​ వికెట్ కూడా తీయాలని నేను ఆశిస్తున్నా."

--వానిందు హసరంగ, శ్రీలంక క్రికెటర్.

జట్టు తరఫున ఆడిన ప్రతిసారి వికెట్లు తీయాలనే కసితో ఆడుతానని చెప్పాడు హసరంగ. జాతీయ జట్టుకు ఆడిన ప్రతిసారి ఉత్తమ ప్రదర్శన చేస్తానని పేర్కొన్నాడు. ముత్తయ్య మురళీధరన్, రంగన హెరాత్​లా కాకుండా హసరంగగానే చరిత్రలో నిలిచిపోవాలనేది అతడి కోరిక అని అన్నాడు.

టీ20 మ్యాచ్​ దిశను మార్చే సత్తా లెగ్​ స్పిన్నర్లకు ఉంటుందని హసరంగ అన్నాడు.

ఇదీ చదవండి:

టీమ్ఇండియా కెప్టెన్​గా రోహిత్.. రవిశాస్త్రి ఏమన్నాడంటే?

కెప్టెన్​గా కోహ్లీ తొలగింపు.. బీసీసీఐపై అభిమానుల ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details