Wahab Riaz Retirement :పాకిస్థాన్ 38 ఏళ్ల పేస్ బౌలర్ వహబ్ రియాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ప్రకటించాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇంటర్నేషనల్ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టిన రియాజ్.. ఇకపై దేశవాలీలో కొనసాగనున్నాడు.
అయితే రియాజ్ 2008లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. 15 ఏళ్లుగా తన జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ.. 2011, 2015, 2019 మూడు వన్డే ప్రపంచకప్‌ల్లో ఆడాడు. 26 ఏళ్ల వయసులో రియాజ్.. తన కెరీర్లో మొదటి వరల్డ్ కప్ (2011) ఆడాడు. ఈ టోర్నీ సెమీఫైనల్స్, భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్‌లో రియాజ్.. టీమ్ఇండియా ఐదు కీలక వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికీ ఆ సెమీస్‌లో భారత్ 29 పరుగుల తేడాలో గెలిచి ఫైనల్స్‌కు వెళ్లింది.
చివరిసారిగా 2020లో న్యూజిలాండ్‌పై టీ20 మ్యాచ్ ఆడాడు రియాజ్. ఆ తర్వాత రియాజ్ ఆటకు దూరంగా ఉన్నాడు. కెరీర్లో 28 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20లు ఆడిన రియాజ్ 237 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్ల జాబితాలో రియాజ్ 18వ స్థానంలో ఉన్నాడు. అందరికి కంటే టాప్‌లో వసీం అక్రమ్ (961 వికెట్లు) ఉన్నాడు. అతడి తర్వాత రెండు, మూడు స్థానాల్లో వరుసగా వకార్ యూనిస్ (789 వికెట్లు), ఇమ్రాన్ ఖాన్ (544 వికెట్లు) ఉన్నారు.