VVS Laxman as coach for Teamindia: మాజీ ఆటగాడు, జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్.. టీమ్ఇండియాకు రాహుల్ ద్రవిడ్ స్థానంలో కోచ్‌గా వ్యవహరించనున్నాడు. జూన్ ఆఖరి వారంలో ఐర్లాండ్‌తో జరగనున్న రెండు టీ20లకు అతడు ఈ బాధ్యతలను చేపట్టనున్నాడు. జులై 1 నుంచి 5వరకు వరకు ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్ (గతంలో వాయిదా పడిన ఐదో టెస్టు) జరగనుంది. అయితే అంతకుముందు ఇంగ్లీష్ కౌంటీ జట్టు లీసెస్టర్‌షైర్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. దీంతో రాహుల్ ద్రవిడ్ టెస్టు జట్టుతో ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఐర్లాండ్‌తో టీ20లకు లక్ష్మణ్ కోచ్‌గా ఉంటాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
వీవీఎస్ లక్ష్మణ్‌కు కొత్త బాధ్యతలు.. ద్రవిడ్ స్థానంలో కోచ్‌గా - భారత్ ఐర్లాండ్ టూర్
VVS Laxman as coach for Teamindia: టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు, జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ సరికొత్త పాత్ర పోషించనున్నాడు. జూన్ ఆఖరి వారంలో ఐర్లాండ్‌తో జరగనున్న రెండు టీ20లకు రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమ్ఇండియాకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
జూన్ 9వ తేదీ నుంచి 19 వరకు దక్షిణాఫ్రికాతో స్వదేశంలో భారత్ తలపడనుంది. అనంతరం జూన్ 26, జూన్ 28న ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడుతుంది. గతంలో ఇలాగే రవిశాస్త్రికి బదులు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పుడు కూడా రవిశాస్త్రి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమ్‌ఇండియాతో ఉన్నాడు. అదే సమయంలో ద్రవిడ్ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లకు కోచ్ పాత్ర పోషించాడు. ఇప్పుడు వీవీఎస్ లక్ష్మణ్ ఆ బాధ్యతలను చేపట్టనుండటం విశేషం.
ఇదీ చూడండి: అభిమాని లేఖకు ధోనీ ఫిదా.. రిప్లై ఏమిచ్చాడంటే..