నాలుగో టెస్టులో విజయావకాశాలు టీమ్ఇండియాకే ఎక్కువగా ఉన్నాయని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు. భారత జట్టులో ప్రపంచస్థాయి బ్యాట్స్‌మెన్ ఉన్నారని.. వాళ్లు కచ్చితంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న ఓవల్ మైదానంలో రాణిస్తారని విశ్లేషించాడు.
రెండో రోజు భారత్ తక్కువ పరుగులకే ఇంగ్గాండ్‌ను నిలువరిస్తుందని అంచనా వేసినా.. బౌలర్లు పట్టు విడవడం వల్ల ఆతిథ్య జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. ఓలీ పోప్ (81), క్రిస్ వోక్స్ (50)ను నిలువరించలేకపోవడం వల్ల ఆధిక్యం సాధించింది. అయితే, కోహ్లీసేన మూడో రోజు మొత్తం బ్యాటింగ్ చేయగలిగితే ఇంగ్లాండ్‌పై పైచేయి సాధించవచ్చని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.