తెలంగాణ

telangana

ETV Bharat / sports

ద్రవిడ్​ స్థానంలో భారత హెడ్​ కోచ్​గా వీవీఎస్​ లక్ష్మణ్​ - భారత హెడ్​ కోచ్​గా లక్ష్మణ్​

VVS laxman head coach భారత జట్టు తాత్కాలిక కోచ్​గా ఎంపికయ్యారు జాతీయ క్రికెట్​ అకాడమీ హెడ్​ వీవీఎస్​ లక్ష్మణ్​. ప్రస్తుత ప్రధాన కోచ్​ రాహుల్​ ద్రవిడ్​కు కరోనా సోకడం వల్ల లక్ష్మణ్​ను నియమించినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో తెలిపారు.

vvs laxman latest news
vvs laxman latest news

By

Published : Aug 24, 2022, 8:47 PM IST

Updated : Aug 24, 2022, 9:40 PM IST

VVS laxman head coach: ఆగస్టు 27న యూఏఈలో ప్రారంభమయ్యే ఆసియా కప్​కు తాత్కాలిక ప్రధాన కోచ్​గా ఎంపికయ్యారు జాతీయ క్రికెట్​ అకాడమీ హెడ్​ వీవీఎస్​ లక్ష్మణ్​. ప్రస్తుత ప్రధాన కోచ్​ రాహుల్​ ద్రవిడ్​కు కరోనా సోకడం వల్ల లక్ష్మణ్​ను నియమించినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో తెలిపారు. ద్రవిడ్​కు కొవిడ్​ నెగటివ్​ వచ్చిన తర్వాత జట్టులో చేరతాడని షా పేర్కొన్నారు. యూఏఈ వెళ్లే ముందు నిర్వహించిన పరీక్షల్లో ద్రవిడ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే పాక్‌తో తొలి మ్యాచ్ ఆగస్టు 28 నాటికి ద్రవిడ్ కోలుకుని యూఏఈ వెళ్లే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ ఆడిన టీమ్‌ఇండియాకు రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ కోచింగ్‌ బాధ్యతలు చేపట్టారు. ద్రవిడ్‌తోపాటు బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్‌ రాఠోడ్, బౌలింగ్‌ కోచ్ పరాస్ మాంబ్రేకు సెలెక్షన్‌ కమిటీ ఆ సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చింది. రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మంది సభ్యుల భారత్ జట్టును ఆసియా కప్‌ కోసం ఎంపిక చేసింది. కేఎల్ రాహుల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. విరాట్ కోహ్లీ, దినేశ్‌ కార్తిక్‌, హార్దిక్‌ పాండ్య వంటి సీనియర్లకు అవకాశం కల్పించింది. అయితే గాయం కారణంగా కీలక పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్‌ పటేల్, షమీ మెగా టోర్నీకి దూరమయ్యారు. స్టాండ్‌బై ఆటగాళ్లుగా అక్షర్‌ పటేల్, దీపక్‌ చాహర్, శ్రేయస్‌ అయ్యర్‌ను తీసుకుంది.

Last Updated : Aug 24, 2022, 9:40 PM IST

ABOUT THE AUTHOR

...view details