తెలంగాణ

telangana

ETV Bharat / sports

సెహ్వాగ్​ నోట పవన్​కల్యాణ్​ డైలాగ్​.. ఫ్యాన్స్​లో జోష్​! - వీరేంద్ర సెహ్వాగ్​ గబ్బర్​ సింగ్ డైలాగ్​

'నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది' ఈ డైలాగ్​ను పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ చెబితే ప్రతి అభిమాని శరీరంపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మరి ఇదే డైలాగ్​ టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​ నోటి వెంట వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

pawan
పవన్​

By

Published : Sep 7, 2021, 2:11 PM IST

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​.. ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాల్లోనూ విపరీతమైన క్రేజ్​ ఉంది!. సినిమాల్లో ఆయన చెప్పే డైలాగ్​లకు అభిమానులే కాదు పలువురు సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోతుంటారు.

ముఖ్యంగా పవన్ చెప్పిన డైలాగ్​ల్లో 'గబ్బర్​సింగ్'​లోని 'నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది' గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదో ఒక సందర్భంలో ప్రతిఒక్కరి నోటి నుంచి ఇది బయటకు రావాల్సిందే!

ఇప్పుడదే డైలాగ్​ను టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టైల్​లో చెప్పి అలరించాడు. దీనికి సంబంధించిన ​వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​గా మారింది. ఆ వీడియోను మీరూ చూసేయండి..

ఇదీ చూడండి: IndvsEng: భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన మరోసారి చూద్దాం!

ABOUT THE AUTHOR

...view details