Sehwag T20 Cricket: ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌కు ఆదరణ పెరుగుతుండటంతో వన్డే ఫార్మాట్‌ను రద్దు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ తర్వాత ఈ వాదనలు ఎక్కువ కావడం గమనార్హం. ఎందుకంటే ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌కు అభిమానుల ఆదరణ కరువైంది. ఈ మ్యాచ్‌లకు ప్రేక్షకులు లేక స్టేడియాలు బోసిపోయాయి. ఈ అంశంపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. టెస్టులు, వన్డేలను అలాగే వదిలేసి.. టీ20 ఫార్మాట్‌ను మాత్రమే ముందుకు తీసుకెళ్లలేమని స్పష్టం చేశాడు.
'క్రికెట్లో వన్డేలు, టెస్ట్‌లు చాలా కీలకం.. టీ20 ఫార్మాట్‌ను..' - వీరేెంద్ర సెహ్వాగ్ వార్తలు
టెస్టులు, వన్డేలను వదిలేసి.. టీ20 ఫార్మాట్‌ను మాత్రమే ముందుకు తీసుకెళ్లలేమని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఇంకేమన్నాడంటే?
"టీ20 ఫార్మాట్‌ను మాత్రమే ముందుకు తీసుకెళ్లడాన్ని నేను అంగీకరించను. టెస్టు, వన్డే క్రికెట్‌లు అలాగే ఉంటాయి. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఆ ఫార్మాట్‌లను కూడా ఆడేలా ఐసీసీ చూస్తుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్, వన్డే ప్రపంచకప్‌లను నిర్వహిస్తుంది. క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడంలో టెస్టులు, వన్డేలు చాలా కీలకం" అని సెహ్వాగ్ విశ్లేషించాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లు రావడంతో ఆటగాళ్లు ఆర్థికంగా బలపడుతున్నారని పేర్కొన్నాడు.'నాకు తెలిసి క్రికెట్ ఆడేందుకు ఇదే మంచి సమయం. ఒకవేళ మీరు దేశం తరఫున ఆడకపోయినా ఈ టీ20 లీగ్‌ల్లో ఆడొచ్చు. ఈ లీగ్‌లు మీకు (ఆటగాళ్లకు) ఆర్థిక భద్రత'ను కల్పిస్తున్నాయన్నాడు.