తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పంత్​ వంద టెస్టులు ఆడితే చరిత్రలో నిలిచిపోతాడు' - సెహ్వాగ్​ పంత్​ వార్త

Sehwag Panth: 100-150 టెస్టు మ్యాచులు ఆడితే పంత్​ చరిత్రలో నిలిచిపోతాడని భారత మాజీ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్​ అభిప్రాయపడ్డాడు. అందుకే టెస్టు క్రికెట్‌కు ఆడేందుకు ప్రాధ్యానం ఇవ్వాలని అన్నాడు.

By

Published : May 27, 2022, 9:34 PM IST

Sehwag Panth: ప్రపంచ క్రికెట్​లో డాషింగ్ ఓపెనర్ అనే పేరుకు పూర్తి న్యాయం చేసిన వారిలో భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకడు. తన ధనాధన్ బ్యాటింగ్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న సెహ్వాగ్.. రిటైర్ అయిన తర్వాత తన చమత్కారం, సూటి కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గురించి అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు.

"టెస్టు క్రికెటే అసలైన క్రికెట్. కోహ్లీకి ఈ విషయం తెలుసు. అందుకే అతడు ఎక్కువగా టెస్టులకు ప్రాధాన్యం ఇస్తాడు. 100- 150 టెస్టు మ్యాచులు ఆడితే పంత్​ చరిత్రలో నిలిచిపోతాడు. ఇప్పటివరకు కేవలం 11 మంది భారత క్రికెటర్లే ఈ ఘనత సాధించారు. అందుకే టెస్టు క్రికెట్‌ ఆడేందుకు పంత్​ ప్రాధ్యానం ఇవ్వాలి." అని సెహ్వాగ్ అన్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్​తో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచుల్లో సెంచరీలు చేసిన ఏకైక టీమ్​ఇండియా కీపర్‌గా రికార్డుకెక్కాడు పంత్​. ఇప్పటివరకు 30 టెస్టులు ఆడి 40.85 సగటుతో 1920 పరుగులు చేశాడు.

ఇవీ చదవండి:మేం ఫైనల్​కు వెళ్లడం కష్టమే: ఆర్సీబీ కెప్టెన్

ABOUT THE AUTHOR

...view details