తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఒత్తిడిలోనూ జట్టును గెలిపించాడు.. టెస్టుల్లో అతడే కొత్త మిస్టర్ కూల్' - యాషెస్ 2023 లార్డ్స్ మ్యాచ్

టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్.. టెస్టు క్రికెట్​లో ఓ విదేశీ ప్లేయర్​ను మిస్టర్​ కూల్​గా అభివర్ణించాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే..

Sehwag Tweet on Cummins
కమిన్స్​ను ప్రశంసించిన సెహ్వాగ్

By

Published : Jun 22, 2023, 9:56 PM IST

Updated : Jun 22, 2023, 10:44 PM IST

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ పాట్‌ కమిన్స్‌ను కొత్త 'మిస్టర్ కూల్' అంటూ టీమ్ఇండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ కితాబిచ్చాడు. ఇంగ్లాండ్​తో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్​ సిరీస్ 2023లో తొలి మ్యాచ్​లో పాట్‌ కమిన్స్‌ ప్రదర్శనకు అతడిపై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ అతడిని మిస్టర్‌ కూల్​గా అభివర్ణించాడు.

Ashes 2023 : యాషెస్​ సిరీస్ 2023లో ఆసిస్ మొదటి టెస్టు మ్యాచ్​లో విజయకేతనం ఎగురవేసింది. మొదటి రోజు నుంచే నువ్వా-నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్​లో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో విజయం ఖాతాలో వేసుకుంది. 281 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసిస్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. దాదాపు మ్యాచ్ ఆసిస్ చేతుల్లోంచి జారిపోతుందన్న సమయంలో కమిన్స్ కీలక ఇన్నింగ్స్​తో జట్టును విజయతీరాలను నడిపించాడు. నాథన్ లియాన్​ (16 పరుగులు నాటౌట్) తో కలిసి కమిన్స్​ (44 నాటౌట్: 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో) తొమ్మిదో వికెట్​కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కాగా ఇది టెస్టు క్రికెట్ చరిత్రలో తొమ్మిదో వికెట్​కు నాలుగో అత్యధిక భాగస్వామ్యం.

"వాట్‌ ఎ టెస్ట్ మ్యాచ్. నేను ఈ మధ్య కాలంలో చూసిన క్రికెట్​ మ్యాచ్​ల్లో అది అత్యుత్తమమైనది. ఎంతైనా టెస్టు క్రికెటే బెస్ట్ క్రికెట్. పరిస్థితులను బట్టి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకున్న ఇంగ్లాండ్.. జో రూట్ క్రీజులో ఉన్నప్పటికీ ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది. కానీ రెండు ఇన్నింగ్స్​ల్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఖవాజా ఊహించని రీతిలో రెచ్చిపోయి ఆడాడు. అతడి అసాధారణ ఆటతో ఆసిస్ విజయానికి బాటలు పడ్డాయి. ఇక చివర్లో ఒత్తిడిలోనూ లియాన్​తో కలిసి సహనంతో అడిన కమిన్స్​ కొత్త మిస్టర్ కూల్‌. అతడి అద్భుతమైన ఆటతీరుతో ఆస్ట్రేలియాకు చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు."
-వీరేంద్ర సెహ్వాగ్, టీమ్ఇండియా మాజీ ఆటగాడు.

ఇంగ్లాండ్​పై కంగారూల రికార్డుల మోత..
Australia Records In Ashes Series : ఇంగ్లాండ్​లోని ఎడ్జ్​బాస్ట్​న్​ మైదానం వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక యాషెస్​ సిరీస్​ తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. మంచి జోరు మీదున్న ఇంగ్లాండ్​కు చివరి సెషన్‌లో ఆసీస్​ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, నాథన్‌ లియోన్‌లు వీరోచిత పోరాటం చేసి ముకుతాడు వేశారు. అయితే ఇప్పటి వరకు జరిగిన యాషెస్​ సిరీస్​లో ఆస్ట్రేలియా పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఈ కథనాన్ని పూర్తిగా చదవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌లో మొదటి మ్యాచ్​లో విజయం సాధించిన ఆసిస్ 1-0 తో ముందంజలో ఉంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్‌ లార్డ్స్‌ వేదికగా జూన్‌ 28న ప్రారంభంకానుంది.

Last Updated : Jun 22, 2023, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details