కొవిడ్‌తో పోరాడుతున్న దేశానికి మద్దతుగా నిలుస్తున్న క్రీడాకారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా టీమ్ఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ జాబితాలో చేరాడు. తన వంతు సాయంగా ఓ ఫౌండేషన్‌ను స్థాపించి దాని ద్వారా కరోనా బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నాడు.
ఇంట్లో వండిన ఆహారాన్ని కొవిడ్ బాధితులకు పంచడానికి నిర్ణయించుకున్నట్లు వీరేంద్ర సెహ్వాగ్ ఫౌండేషన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఏప్రిల్ 25న ప్రకటించింది. ఇప్పటివరకు 51వేలకు పైగా మహమ్మారి బాధితులకు ఆహారాన్ని ఉచితంగా అందించినట్లు ఫౌండేషన్ వెల్లడించింది. దీంతో పాటు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించినట్లు పేర్కొంది. ఇంకా ఎవరైనా బాధితులు అన్నం లేక అలమటించినట్లయితే తమను సంప్రదించాలని ఫౌండేషన్ కోరింది. తమకు సహాయం చేయాలనుకున్న వారు virenderfoundation84@upiకి విరాళాలు అందించాలని తెలిపింది.