Virat Kohli Leg Exercises : సినిమా స్టార్సే కాదు క్రికెటర్స్ కూడా తమ ఫిటెనెస్ విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తుంటారు. స్వతహాగా అథ్లెట్స్ అయిన వారు బేసిక్ వర్కౌట్స్తోనే తమను తాము ఫిట్‌గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. దీని ద్వారా ఆటతీరులో మార్పుతో పాటు ఆరోగ్యంగా ఉండొచ్చని వారి నమ్మకం. ఇక ఫిట్నెస్ విషయంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎంత నిక్కచ్చిగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఎనిమిదేళ్ల నుంచి ఒక్కసారి కూడా జాతీయ క్రికెట్ అకాడమీకి అతను వెళ్లలేదంటే తన ఫిట్నెస్ స్థాయి ఏ రేంజ్లో ఉందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
తాజాగా విండీస్ పర్యటనకు వెళ్లిన విరాట్.. తన ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించట్లేదు. అక్కడ కూడా తన బిజీ షెడ్యూల్‌ను బ్యాలెన్స్ చేస్తునే.. జిమ్‌లో కసరత్తలు చేస్తూ కనిపించాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. "ప్రతి రోజు 'లెగ్‌డే'. గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతోంది" అంటూ ఓ క్యాప్షన్‌ను రాసుకొచ్చాడు. తన జిమ్ కోచ్‌తో కలిసి కాళ్లను బలోపేతం చేసే పలు వ్యాయామాలను చేశాడు. దీంతో నెటిజన్లు అసలు 'లెగ్ డే' అంటే ఏంటి అని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. అసలు ఈ లెగ్ వర్కౌట్లు ఏంటంటే?
Leg Exercise Uses : స్పోర్ట్స్ ఆడే వారిలో కాళ్లు చాలా బలంగా ఉండాలి. క్రికెట్లో ఆటగాళ్లు ఫీల్డింగ్, బ్యాటింగ్ చేసే సమయంలో వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడం, బౌలింగ్ కోసం రనప్ చేయడం లాంటివి చేస్తుంటారు. అటువంటి సమయంలో తమ కాళ్లు చురుగ్గా స్పందించాలంటే మరి తప్పకుండా వ్యాయామం చేయాల్సిందే. వీటన్నింటినీ కోచ్ పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. అయితే బరువులను మోయడం వంటి వ్యాయామాలు చేయడం వల్ల పిక్కలు బలంగా మారతాయి. ఇవి గాయాల ప్రభావాన్ని తగ్గించేందుకు సహాయ పడుతుందని. బాడీ సైన్స్ అకాడమీ సహవ్యవస్థాపకుడు వరుణ్ రత్తన్ 'లెగ్ ఎక్స్‌ర్‌సైజ్'ల గురించి వివరించారు.