తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ చెత్త రికార్డు.. ఆ జాబితాలో రెండో స్థానం

Kohli duck out: టీమ్ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సార్లు డకౌటైన వారిలో సచిన్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు.

Virat Kohli duck out, విరాట్ కోహ్లీ డకౌట్
Virat Kohli

By

Published : Jan 22, 2022, 3:55 PM IST

Kohli duck out: టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఓ విషయంలో విరాట్ కోహ్లీ అధిగమించేశాడు. ఇదేదో మంచి రికార్డు అనుకోకండి. ఈ లిస్ట్‌లోకి చేరకూడదని బ్యాటర్లు భావిస్తుంటారు. ఇంతకీ అదేంటంటే.. వన్డే క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌట్‌ కావడం. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ డకౌట్ అయ్యాడు. దీంతో వన్డే కెరీర్‌లో 14వ సారి సున్నా వద్దే పెవిలియన్‌కు చేరాడు. ఈ జాబితాలో ద్రవిడ్ (13), రోహిత్‌ (13)ను కోహ్లీ దాటేశాడు.

ఓపెనర్‌ నుంచి ఏడో స్థానం వరకు బ్యాటింగ్‌ చేసే వన్డేల్లో అత్యధికసార్లు డకౌట్‌ అయిన భారత ఆటగాళ్లలో సచిన్‌ తెందూల్కర్‌ (20), యువరాజ్‌ సింగ్‌ (18), సౌరభ్‌ గంగూలీ (16) ముందున్నారు. తర్వాత సురేశ్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్‌తోపాటు విరాట్‌ కోహ్లీ (14) జాబితాలోకి చేరాడు.

సచిన్ తర్వాత కోహ్లీనే..

ఇక అన్ని ఫార్మాట్​లలో కలిపి అత్యధికసార్లు డకౌట్‌ అయిన భారత క్రికెటర్ల జాబితాలో సచిన్ తర్వాత స్థానంలో నిలిచాడు కోహ్లీ. లిటిల్ మాస్టర్ తన కెరీర్​లో 34సార్లు డకౌట్ కాగా.. కోహ్లీ 31సార్లు సున్నా పరుగులకే వెనుదిరిగాడు. సెహ్వాగ్ కూడా 31 డకౌట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరి తర్వాత గంగూలీ (29), యువరాజ్ సింగ్ (26) ఉన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: IPL Mega Auction: ఏ ఆటగాళ్లు ఏ జాబితాలో ఉన్నారంటే?

ABOUT THE AUTHOR

...view details