Kohli Test career : టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి రికార్డులు కొత్తేమి కాదు. అతడు మైదానంలో బ్యాట్ పడితే పరుగుల వరద పారాల్సిందే. తన బ్యాటింగ్ స్కిల్స్‌తో ప్రపంచంలోని మేటి ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. అయితే ఈ రికార్డుల రారాజు నేడు(మే 20)తో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. 2011 జూన్ 20 రోజున విరాట్ టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. తన మొదటి మ్యాచ్‌ను వెస్టిండీస్‌పై ఆడాడు. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిసి4, 15 పరుగులు మాత్రమే చేశాడు. అయితే తాజాగా తన అరంగేట్ర రోజును గుర్తుచేసుకుంటూ.. సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. "ఈ రోజుతో నా టెస్టు కెరీర్‌కు 12 ఏళ్లు. టీమ్ఇండియాకు ఆడడాన్ని ఎప్పుడు గర్వంగా భావిస్తాను" అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అభిమానులకు అతడికి అభినందనలు తెలుపుతూ క్రికెట్లో అతడు సాధించిన రికార్డులను గుర్తుచేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
Kohli Test stats : కోహ్లీ ఇప్పటివరకు 109 టెస్టులు ఆడాడు. 185 ఇన్నింగ్స్‌లో 48.72 సగటుతో 8,479 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో 11 నాటౌట్లు ఉన్నాయి. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 254* నాటౌట్. 28 సెంచరీలు బాదాడు. 28 అర్ధ శతకాలు కొట్టాడు. అలానే ఏడు సార్లు డబుల్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. 24 సిక్స్‌లు, 950 ఫోర్లు బాదాడు. 110 క్యాచ్‌లను పట్టాడు. కెప్టెన్‌గా 40 మ్యాచ్‌లు గెలిచాడు. 10 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్, మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డులను అందుకున్నాడు.
ఇకపోతే అండర్ -19 ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు సారథి అయిన విరాట్ కోహ్లీ మ్యాచ్ విన్నర్‌గా, ఛేజ్ మాస్టర్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. సచిన్ వారసుడిగా మాజిలతో ప్రశంసలను అందుకున్నాడు. అలా మహేంద్ర సింగ్ ధోనీ నుంచి 2014లో టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. తన దూకుడు స్వభావంతో టీమ్ఇండియాను నెం. 1 జట్టుగా నిలిపాడు. అలాగే ఐసీసీ మొదటి సారి నిర్వహించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు జట్టును చేర్చాడు. కానీ ఆ తుదిపోరులో న్యూజిలాండ్‌పై భారత జట్టు ఓటమిని అందుకుంది. ఇక రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినా ఫలితం మారలేదు. ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ రెండోసారి డబ్ల్యటీసీ ఫైనల్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నాడు.