Virat Kohli Success Mantra :టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మెగాటోర్నీలో దూసుకుపోతున్నాడు. ఒక్కో మ్యాచ్‌లో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఇక ఛేజింగ్ అంటే విరాట్ ఎలా చెలరేగిపోతాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ స్థాయికి చేరేందుకు రెగ్యులర్‌గా నెట్స్‌లో శ్రమిస్తానని విరాట్ ఎప్పుడూ చెబుతుంటాడు. అయితే రీసెంట్గా ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్‌స్పోర్ట్స్‌తో చిట్‌చాట్ చేశాడు. ఈ చిట్‌చాట్‌లో తను నమ్మకంతో ఆచరించే నినాదం ఒకటుందని అన్నాడు.
అత్యున్నత స్థాయికి చేరుకున్నాని ఎప్పుడూ భావించనని.. స్కిల్స్ డెవలప్ చేసుకునేందుకు రోజూ కష్టపడతానని విరాట్ అన్నాడు. " వ్యక్తిగతంగా, సామర్థ్యపరంగా మరింత మెరుగ్గయ్యేందుకు ఎప్పటికప్పుడు శ్రమిస్తా. నిరంతరం అందుకోసం సాధన చేస్తుంటా. నిలకడగా ఆడేందుకు ఇదే నాకు సహాయపడింది. అత్యుత్తమ స్థాయి అనేది ఎక్కడా ఉండదని.. దానికి హద్దు లేదని భావిస్తా. లేకపోతే ఓ స్టేజ్‌కు వచ్చేసరికి ఆగిపోవాల్సి ఉంటుంది. ఇక ఎక్స్‌లెన్స్ అనే పదాన్ని నేను పట్టించుకోను. దానికంటూ ఓ నిర్వచనం కూడా లేదనేది నా ఫీలింగ్. అందుకే స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలనే దానిపైనే దృష్టి సారిస్తుంటా. పెర్ఫార్మెన్స్ అనేది బై ప్రొడక్ట్. ఎప్పుడూ జట్టును ఎలా గెలిపించాలనే ఆలోచనతో ఉండాలి" అని విరాట్ అన్నాడు.