Virat Kohli Social Media Income : రెండు రోజులుగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా సంపాదనపై వస్తున్న వార్తలను అతడు ఖండిచాడు. ఒక్కో పోస్ట్‌కు తను రూ 11.45 కోట్లు వసూల్ చేయడం అవాస్తవమని తెలిపాడు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు.
"నా జీవితంలో పొందిన ప్రతిదానికీ నేను కృతజ్ఞతుడ్ని. అందుకు రుణపడి ఉన్నాను. కానీ నా సోషల్ మీడియా సంపాదన గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. అందులో ఎలాంటి నిజం లేదు." అని విరాట్ ' ట్వీట్ చేశాడు.
Hopper HQ Instagram Rich List : అయితే ఇటీవలే ప్రముఖ సోషల్ మీడియా సంస్థ 'హూపర్ హెచ్‌క్యూ' .. ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్ కోసం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ 20 మంది పేర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో విరాట్ 14వ స్థానంలో ఉన్నాడు. దీని ప్రకారం అతడు ప్రతి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు దాదాపు రూ. 11.45 కోట్లు ఆర్జిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ లిస్ట్‌లో టాప్ 15లో భారత్ నుంచి విరాట్ ఒక్కడే స్థానం సంపాదించాడు.