టీమ్‌ఇండియా(Team India) సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) వెంటనే సచిన్ తెందూల్కర్‌కు ఫోన్ చేయాలని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అంటున్నారు. తన బ్యాటింగ్ టెక్నిక్‌లోని లోపానికి పరిష్కారం అడిగితే మేలని సూచించాడు. ఆఫ్‌స్టంప్ ఆవల ఐదు, ఆరు, ఏడో స్టంప్ లైన్‌లో అతడు ఔటవ్వడం ఆందోళన కలిగిస్తోందని వెల్లడించాడు. మూడో టెస్టు తొలి రోజు తర్వాత ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో టీమ్‌ఇండియా పేలవంగా ఆడుతోంది. బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ చేరడం వల్ల కేవలం 78 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. ఈ మ్యాచులోనైనా భారీ స్కోరు చేస్తాడని ఆశించిన విరాట్ కోహ్లీ 7 పరుగులే చేసి అండర్సన్(Anderson) బౌలింగ్‌లో ఔటయ్యాడు. టెస్టు కెరీర్లో అతడు జిమ్మీకి వికెట్ ఇవ్వడం ఇది ఏడోసారి. గతంలో లైయన్ బౌలింగ్‌లోనూ ఏడుసార్లు ఔటయ్యాడు. ఆఫ్‌సైడ్ నాలుగు, ఐదో స్టంప్‌లైన్‌లో వెళ్తున్న బంతులకు అతడు ఔటవుతున్నాడు.