ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ రెండో సీజన్(WTC Second Edition)పై టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) స్పందించాడు. ఈ ఎడిషన్లో అభిమానులకు కావాల్సినంత ఉత్సాహాన్ని భారత జట్టు అందిస్తుందని తెలిపాడు. ఈ సీజన్ కోసం తమ టీమ్ నూతన శక్తితో ఎదురుచూస్తుందని పేర్కొన్నాడు.
"డబ్ల్యూటీసీ ఆరంభ ఎడిషన్లోనే ఫైనల్ చేరుకోవడం ఆనందానిచ్చింది. అందులోనూ కివీస్ వంటి బలమైన జట్టుతో పోటీపడటం గొప్ప విషయం. ఒక్క ఫైనల్లోనే కాదు. ఛాంపియన్షిప్ మొత్తంలోనూ ఆటగాళ్లు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారు. తదుపరి సీజన్ కోసం ఆటగాళ్లతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ కోసం కొత్త శక్తితో ఉన్నాం. అభిమానులకు కావాల్సినంత వినోదం పంచడానికి సిద్ధం."
-విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్.