తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్ రికార్డులపై కోహ్లీ కన్ను.. మరో సెంచరీ చేస్తే టాప్ లిస్టులోకి.. - కోహ్లీ వన్డే మ్యాచ్​లు రన్స్

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సచిన్ తెందూల్కర్​ రికార్డులపై కన్నేశాడు. శ్రీలంకతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో శతకాలు బాదితే.. సచిన్ రికార్డులను అధిగమించనున్నాడు.

Virat Sachin Records On Srilanka
Virat Kohli Sachin Tendulkar

By

Published : Jan 10, 2023, 12:31 PM IST

మంగళవారం అసోం గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరిగే వన్డేలో దాసున్ షనక సారథ్యంలోని శ్రీలంక జట్టుతో రోహిత్ సేన తలపడనుంది. సీనియర్​ ఆటగాళ్లు రోహిత్​, విరాట్​ సారథ్యంలో టీమ్​ బరిలోకి దిగనుంది. ఇకపోతే ఈ మ్యాచ్​లో అందరి దృష్టి విరాట్​పైనే ఉంది. ఎందుకంటే క్రికెట్​ దిగ్గజం సచిన్​ పేరిట ఉన్న పలు రికార్డులను విరాట్​ బద్దలు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 1214 రోజుల సుదీర్ఘమైన విరామం తర్వాత వన్డేల్లో 44వశతకం బాది రికార్డు సృష్టించిన విరాట్​.. మళ్లీ ఈ వన్డేలో సెంచరీ చేసి శ్రీలంకతో సచిన్​కు ముడి పడి ఉన్న రికార్డును అధిగమిస్తాడా అని క్రికెట్​ లవర్స్ ఎదురుచూస్తున్నారు. చివరగా 2019లో వెస్టిండీస్​తో వన్డే ఆడిన విరాట్ తన 43వ సెంచరీ చేశాడు. ఇక 2022 డిసెంబరులో బంగ్లాదేశ్​తో జరిగిన వన్డే సిరీస్​లో లాంగ్​ గ్యాప్​ తర్వాత 44వ సెంచరీని నమోదు చేశాడు. ఇక మరోసారి కోహ్లీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందూల్కర్​ పేరు మీద ఉన్న మరో అరుదైన రికార్డును బ్రేక్​ చేస్తాడా అనేది వేచి చూడాలి. కోహ్లీ వన్డే క్రికెట్‌లో చివరిసారిగా చేసిన సెంచరీతో ఆస్ట్రేలియన్​ బ్యాటింగ్ దిగ్గజం రికీ పాంటింగ్‌ రికార్డును అధిగమించాడు.

సచిన్​ సరసన నిలుస్తాడా..?
స్వదేశంలో జరిగిన వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు(20) సాధించిన క్రికెట్​ లెజెండ్​ సచిన్​ తెందూల్కర్​. ఇకపోతే భారత మాజీ కెప్టెన్ కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో 19 సెంచరీలు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. సచిన్​ క్రియేట్​ చేసిన మార్క్​ను అందుకొవడానికి కేవలం ఒక్క సెంచిరీ దూరంలో ఉన్నాడు విరాట్​ కోహ్లీ. శ్రీలంకతో ఆడే మొదటి మ్యాచ్​లో కోహ్లి మూడు అంకెలను చేరుకుంటే గనుక స్టార్ బ్యాటర్ తెందూల్కర్​పై ఉన్న భారీ రికార్డును సమం చేస్తాడు. అలాగే మరో శతకం చేయగలిగితే విరాట్​ ప్రపంచ రికార్డును బ్రేక్ చేయడం ఖాయం. సచిన్ తెందూల్కర్​ స్వదేశంలో 164 వన్డేలు ఆడి 20 సెంచరీలు చేశాడు. కోహ్లి భారత్​లో 101 వన్డేల్లో పాల్గొని 19 సెంచరీలను నమోదు చేశాడు. మొత్తంగా కోహ్లీ వన్డే క్రికెట్‌లో 12,471 పరుగులు చాశాడు.

180 పరుగుల దూరంలో..
వన్డేల్లో ఆల్ టైమ్ బెస్ట్​ రన్నర్స్​గా పేరొందిన టాప్ 5లో చేరాలంటే అతడు ఇంకా 180 పరుగులు చేయాల్సి ఉంది. తెందూల్కర్​, కుమార సంగక్కర, రికీ పాంటింగ్, సనత్ జయసూర్య, మహేల జయవర్ధనే తర్వాత కోహ్లీ ఈ జాబితాలో చేరనున్నాడు.

8 శతకాలు ఈ జట్టుపైనే..
వన్డే క్రికెట్‌లో శ్రీలంక జట్టుపైనే కోహ్లి, తెందూల్కర్​లు 8 సెంచరీలు సాధించడం విశేషం. 50 ఓవర్ల ఫార్మాట్‌లో శ్రీలంకపై తెందూల్కర్, కోహ్లీల మినహా ఇన్ని శతకాలు సాధించిన ప్లేయర్​ లేడు. బ్యాటింగ్ దిగ్గజం తెందూల్కర్ శ్రీలంకపై 84 వన్డేల్లో 3,113 పరుగులు చేశాడు. 1996 ప్రపంచకప్​ గెలిచిన శ్రీలంకపై ఇప్పటి వరకు 47 వన్డే మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 2,220 పరుగులు చేశాడు. కోహ్లీ శ్రీలంకపై 19 యాభై కంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేశాడు.

ఈ సిరీస్‌లో కోహ్లి సెంచరీ చేస్తే, ఒక జట్టుపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ తెందూల్కర్​ సరసన నిలిచి రికార్డును సమం చేసే అవకాశం ఉంది. వెస్టిండీస్, ఆస్ట్రేలియాపై వరుసగా 9 సెంచరీలు చేసిన కోహ్లీ తెందూల్కర్​తో సమానమైన స్థానంలో నిలవనున్నారు.

ABOUT THE AUTHOR

...view details