రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ మందలింపునకు గురయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచులో అతడు ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించడమే ఇందుకు కారణం. ఈ మ్యాచులో విరాట్ 29 బంతుల్లో 4 బౌండరీల సాయంతో 33 పరుగులు చేశాడు. స్కోరు వేగం పెంచే క్రమంలో జేసన్ హోల్డర్ వేసిన 12.1వ బంతిని అతడు భారీ షాట్ ఆడాడు. బ్యాటు అంచుకు తగిలిన బంతి గాల్లోకి లేచింది. లాంగ్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్ విజయ్ శంకర్ వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి ఆ క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసిపట్టాడు.
కుర్చీని తన్నేసిన కోహ్లీ- మందలించిన రిఫరీ - ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించిన విరాట్ కోహ్లీ
ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించినందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ మందలింపునకు గురయ్యాడు. ఔటైన ఆవేశంలో అడ్వర్టైజ్‌మెంట్ కుషన్, కుర్చీని తన్నేయడమే ఇందుకు కారణం.
కోహ్లీ
ఔటైన ఆవేశంలో కోహ్లీ డగౌట్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడు అడ్వర్టైజ్‌మెంట్ కుషన్, కుర్చీని తన్నేశాడు. అతడు ఐపీఎల్ నియమావళిలోని లెవల్ 1 నిబంధనలను ఉల్లంఘించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. దాంతో రిఫరీ వెంగలిల్ నారాయణ్ కుట్టీ ఆర్‌సీబీ కెప్టెన్‌ను మందలించాడు. కాగా 2016లో ఇదే బెంగళూరుతో మ్యాచులో గౌతమ్ గంభీర్ ఇలాగే చేయడంతో అతడి మ్యాచు ఫీజులో 15% కోత విధించడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ తొలుత 149 పరుగులే చేసినప్పటికీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.