Virat Kohli: కెప్టెన్‌గా వీడ్కోలు పలకడానికి ముందు బీసీసీఐ విరాట్ కోహ్లీకి ఓ ఆఫర్ ఇచ్చింది. తన 100వ టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాలని విరాట్‌కు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ కోల్పోయిన తర్వాత టెస్టు కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు కోహ్లీ. ఈ విషయంపై ఓ సీనియర్ బీసీసీఐ అధికారితో శుక్రవారం ఫోన్లో మాట్లాడాడు కోహ్లీ. ఆ సమయంలో కోహ్లీకి కెప్టెన్‌గా బెంగళూరులో ఒక ఫేర్వెల్ మ్యాచ్‌ను ఆయన ఆఫర్ చేసినట్లు సమాచారం. ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కారణంగా.. బెంగళూరు అతడికి సెకండ్ హోమ్‌గా ఉంది. సుదీర్ఘ ఫార్మాట్లో అతడి సేవలకు గానూ అదే అతడికి సారథిగా సరైన ముగింపు అయ్యుండేది! అయితే ఈ ఆఫర్‌ను కోహ్లీ తిరస్కరించాడట.
"ఒక్క మ్యాచ్‌తో ఏమీ మారదు. నేను అలాంటివి కోరుకునేవాడిని కాదు." అని విరాట్ కోహ్లీ బదులిచ్చినట్లు సమాచారం. దీంతో సిరీస్ ఓటమితో సారథ్యానికి అతడు స్వస్తి చెప్పినట్లు అయ్యింది. బ్యాటింగ్‌పై దృష్టిసారించేందుకు తనపై ఉన్న ఉన్న ఒత్తిడి, బాధ్యతలను వదులుకోవాలని అతడు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన కోహ్లీ.. 68 మ్యాచుల్లో టీమ్ఇండియాకు సారథ్యం వహించాడు. అందులో 40 సార్లు గెలిపించాడు. కేవలం 17 మ్యాచుల్లోనే ఓటమి పాలయ్యాడు. టీమ్ఇండియా అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు.