తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్​.. దిగ్గజాలతో సమానంగా.. - భారత్​-విండీస్​ వన్డే

Virat Kohli Records: విరాట్​ కోహ్లీ తన ఖాతాలో మరో రికార్డు నమోదు చేశాడు. సొంతగడ్డపై ఆడిన వన్డేల్లో అత్యంత వేగంగా 5వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Virat Kohli Records
విరాట్​ కోహ్లీ

By

Published : Feb 6, 2022, 7:59 PM IST

Virat Kohli Records: టీమ్​ఇండియా రన్​మెషీన్​ విరాట్​ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు నమోదైంది. అంతర్జాతీయ వన్డేల్లో సొంతగడ్డపై 5వేలకుపైగా పరుగులు చేసిన బ్యాట్స్​మెన్​ జాబితాలో చేరాడు. విండీస్​తో ఆదివారం జరిగిన తొలి వన్డే సందర్భంగా ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డు నెలకొల్పిన నాలుగో బ్యాట్స్​మెన్​గా నిలిచాడు.

అగ్రస్థానంలో సచిన్​ తెందుల్కర్​ ఉన్నాడు. సచిన్.. 48.11 సగటుతో 6976 పరగులు చేశాడు. ఆ తర్వాత స్థానాల్లో రికీ పాంటింగ్​ (ఆస్ట్రేలియా) 5521 పరుగులు- 39.71 సగటు, కల్లీస్​ (దక్షిణాఫ్రికా) 5186 పరుగులు- 45.89 సగటుతో నిలిచారు. సగటు(60.17)లో విరాట్​ కోహ్లీనే అగ్రస్థానంలో ఉన్నాడు. సొంతగడ్డపై అత్యంత వేగంగా 5వేల పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

సొంతగడ్డపై విరాట్​ కోహ్లీ 99 మ్యాచ్​ల్లో 5002 పరుగులు చేశాడు. ఇందులో 19 శతకాలు, 25 అర్థశతకాలు ఉన్నాయి.

ఇదీ చూడండి :ఆటకు ముందు చన్నీళ్ల స్నానం చేయాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details