తెలంగాణ

telangana

ETV Bharat / sports

Virat Kohli MS Dhoni: ధోనీ కెప్టెన్సీ వీడ్కోలుపై కోహ్లీ భావోద్వేగ పోస్టు - IPL 2022

Virat Kohli MS Dhoni: మహేంద్ర సింగ్​ ధోనీ అంటే తనకు ఎప్పుడూ అమితమైన గౌరవమని అన్నాడు భారత మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. చెన్నై సూపర్​ కింగ్స్​ కెప్టెన్​గా ధోనీ తప్పుకోవడంపై విరాట్​ కోహ్లీ భావోద్వేగ పోస్టు పెట్టాడు. అతడి అధ్యాయాన్ని ఫ్యాన్స్​ ఎప్పటికీ మరచిపోలేరని అన్నాడు.

Virat Kohli MS Dhoni  news
విరాట్​ కోహ్లీ ధోనీ న్యూస్​

By

Published : Mar 25, 2022, 10:54 AM IST

Virat Kohli MS Dhoni: ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీకి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్సీ పగ్గాలు వదులుకొని మహేంద్రసింగ్‌ ధోనీ అందరికీ షాకిచ్చాడు. ఈ విషయంపై కోహ్లీ స్పందిస్తూ.. ధోనీని ప్రత్యేకంగా అభినందించాడు. ధోనీ సారథ్యంలోనే విరాట్‌ కోహ్లీ టీమ్‌ఇండియాలోకి వచ్చాడు. ఆ తర్వాత మేటి ఆటగాడిగా రాణించి మహీ నుంచే అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ చేపట్టాడు. దీంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ధోనీ.. సీఎస్కే కెప్టెన్సీ వదులుకోగానే కోహ్లీ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించాడు.

"చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున అత్యుత్తమ సారథ్య బాధ్యతలు నిర్వర్తించావు. ఎల్లో జెర్సీలో దిగ్గజ కెప్టెన్‌గా కొనసాగావు. నీ చరిత్రను అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. నువ్వంటే నాకెప్పుడూ అమితమైన గౌరవమే" అని కోహ్లీ భావోద్వేగ పోస్టుతో సహా ధోనీని హత్తుకునే ఓ ఫొటో పంచుకున్నాడు.

కాగా, ఈ ఏడాది విరాట్‌ సైతం రాయల్‌ ఛాలెంజర్స్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. అతడి స్థానంలో ఆర్సీబీ యాజమాన్యం ఫాఫ్​ డుప్లెసిస్‌ను కెప్టెన్‌గా నియమించింది. దీంతో 2013 తర్వాత ధోనీ, కోహ్లీ తొలిసారి ఐపీఎల్‌లో కెప్టెన్లుగా కాకుండా ఆటగాళ్లుగా ఆడనున్నారు. మరోవైపు ధోనీ సీఎస్కే సారథిగా తప్పుకోవడంపై ఆ జట్టు ఆటగాడు డ్వేన్‌ బ్రావో, మాజీ ఆటగాడు సురేశ్‌ రైనా సైతం సామాజిక మాధ్యమాల్లో స్పందించారు.

ఇదీ చదవండి:Ipl 2022: జడేజా.. ధోనీ నమ్మకాన్ని నిలబెడతాడా.?

ABOUT THE AUTHOR

...view details