తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ అపురూప క్షణాల్ని గొప్పగా ఆవిష్కరించారు: కోహ్లీ - 83 చిత్రబృందంపై విరాట్ కోహ్లీ ప్రశంసలు

Virat Kohli on 83 movie: 1983 ప్రపంచకప్​లో టీమ్ఇండియా విజేతగా నిలిచింది. ఈ అపూరూప ఘట్టాల్ని తెరపై ఆవిష్కరించిన చిత్రం '83'. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను చూసిన టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించాడు.

virat kohli on 83 movie, kohli latest news, విరాట్ కోహ్లీ 83 చిత్రం, కోహ్లీ లేటెస్ట్ న్యూస్
virat kohli

By

Published : Dec 25, 2021, 12:36 PM IST

Virat Kohli on 83 movie: 1983లో భారత్ తొలిసారిగా ప్రపంచకప్ టైటిల్ గెలిచింది. ఆ సమయంలో మన జట్టుపై పెద్దగా అంచనాలే లేవు. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ సగర్వంగా విశ్వవిజేతగా నిలిచింది కపిల్​సేన. ఈ టోర్నీ కోసం వెళ్లిన ఆటగాళ్ల మధ్య అనుబంధాలు, వారు చవి చూసిన అవమానాలు.. ఆట, ఆటగాళ్ల చుట్టూ అల్లుకొన్న ఎన్నో భావోద్వేగాలు.. ఇలా ప్రతి ఒక్కటి విలువైనదే. అలాంటి విలువైన, వివేక వంతమైన సన్నివేశాలతో తీర్చిదిద్దినదే '83' చిత్రం. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ చిత్రబృందాన్ని మెచ్చుకుంటూ ఓ ట్వీట్ చేశాడు.

"భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇలాంటి సందర్భాన్ని ఇంతకంటే గొప్పగా ఎవరూ తీయలేరు. 1983 ప్రపంచకప్ తాలూకూ భావోద్వేగాన్ని గొప్పగా ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. రణ్​వీర్​ చాలా గొప్పగా చేశావు" అంటూ చెప్పుకొచ్చాడు కోహ్లీ.

విరాట్ కోహ్లీ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. ఇంత బిజీ షెడ్యూల్​లో ఉన్నా '83' సినిమాను వీక్షించాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టు ఆదివారం ప్రారంభంకానుంది. ఈ పర్యటనలో మొత్తం మూడు టెస్టులతో పాటు మూడు వన్డేలు ఆడనున్నాయి ఇరుజట్లు.

ఇక '83' చిత్రంలో రణ్​వీర్ సింగ్​ కపిల్​దేవ్​గా కనిపించి ప్రేక్షకుల్ని ఫిదా చేశాడు. కపిల్ భార్య రోమి భాటియాగా చేసిన దీపికా పదుకొణె ఆకట్టుకుంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంటమ్‌ ఫిల్మ్స్, విబ్రి మీడియా, కా ప్రొడక్షన్స్, నదియవాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్, కబీర్‌ఖాన్‌ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఇవీ చూడండి: భజ్జీతో కలిసి ఆడటం గర్వంగా ఉంది: ద్రవిడ్

ABOUT THE AUTHOR

...view details