తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసీస్‌తో టీ20 సిరీస్‌.. కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే - kohli T20 11000 runs

టీ20 ప్రపంచకప్​ ముందు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటంటే..

kohli
కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే

By

Published : Sep 16, 2022, 10:31 PM IST

టీ20 ప్రపంచకప్ ముందు టీమ్​ఇండియా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో టీ20 సిరీస్‌లను ఆడనుంది. సెప్టెంబర్ 20 నుంచి ఆసీస్‌-భారత్‌ మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్​లో టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డులను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో సెంచరీ బాది ఫామ్‌లోకి వచ్చిన విరాట్​.. అదే ఊపును కొనసాగిస్తే ఈ రికార్డులను కొట్టడం అతడికి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

టీ20 కెరీర్‌లో గత ఆసియా కప్‌లోనే తొలి శతకం సాధించిన విరాట్ కోహ్లీ (122*) భారత్‌ తరఫున టాప్‌ స్కోరర్ కావడం విశేషం. అలాగే అత్యధిక పరుగుల జాబితాలో విరాట్ (3,584) రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ కంటే ముందు టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ (3,620) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి మధ్య తేడా కేవలం 36 పరుగులే. ఈ క్రమంలో ఫామ్‌లో ఉన్న కోహ్లీ రోహిత్‌ను అధిగమించే అవకాశం లేకపోలేదు. కోహ్లీ ముందున్న మరికొన్ని రికార్డులు ఇవే..

  • టీ20ల్లో 11వేల మార్క్‌కు చేరిన తొలి భారత క్రికెటర్‌గా మారే అవకాశం. ప్రస్తుతం 349 మ్యాచుల్లో 40.37 సగటుతో 10,902 పరుగులతో ఉన్నాడు.
  • మూడు ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీ 468 మ్యాచుల్లో 71 శతకాలతో 24,002 పరుగులు సాధించాడు. ఇంకో 63 పరుగులు చేస్తే రాహుల్‌ ద్రవిడ్ (24,064)ను అధిగమిస్తాడు.

ఇదీ చూడండి: ఈ చిన్నారి కుర్రాళ్ల మనసు దోచిన హీరోయిన్​.. నేషనల్​ అవార్డు గ్రహీత కూడా

ABOUT THE AUTHOR

...view details