తెలంగాణ

telangana

ETV Bharat / sports

జకోవిచ్ ఎక్కడున్నా కలుస్తా- అతడితో కాఫీకి రెడీ: విరాట్ - virat Djokovic bonding

Virat Kohli On Djokovic: టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్​తో తనకు ఉన్న బాండింగ్​ గురించి బీసీసీఐ టీవీతో చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Virat Kohli On Djokovic
Virat Kohli On Djokovic

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2024, 3:25 PM IST

Updated : Jan 14, 2024, 4:22 PM IST

Virat Kohli On Djokovic:సెర్బియా దిగ్గజ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్, తనకు క్రికెటర్ విరాట్ కోహ్లీతో ఉన్న సన్నిహిత్యం గురించి రీసెంట్​గా సోనీ స్పోర్ట్స్​ ఛానెల్​లో తెలిపాడు. దీనిపై తాజాగా విరాట్ స్పందించాడు. అతడు బీసీసీఐ టీవీతో జకోవిచ్​తో ఉన్న బాండింగ్​​ గురించి షేర్ చేసుకున్నాడు.'వరల్డ్​టాప్ క్లాస్​ అథ్లెట్​తో కనెక్ట్​ అవ్వడం హ్యాపీ. ఫిట్​నెస్ పట్ల అతడికి ఉన్న ప్యాషన్, నన్ను కూడా ప్రభావితం చేస్తుంది. అతడు త్వరలోనే భారత్ వస్తానన్నాడు. ఒకవేళ నేను భారత్​లో ఉన్నప్పుడు జకోవిచ్ ఇక్కడకు వచ్చినా లేదా అతడు ఆడే దేశంలో నేను అక్కడ ఉన్నా కలిసేందుకు వెళ్తాను. కచ్చితంగా జకోవిచ్​తో కలిసి కప్ కాఫీ తాగుతా' అని విరాట్ అన్నాడు.

Djokovic On Virat 50th Century: విరాట్ వన్డేల్లో 50వ సెంచరీ నమోదు చేసినప్పుడు జకోవిచ్ తనకు శుభాకాంక్షలు తెలిపిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. 'ఒకసారి ఇన్​స్టాగ్రామ్​లో జకోవిచ్ ప్రొఫైల్ చూసి, హలో అని మెసేజ్ చేశా. తన నుంచి నాకు రిప్లై వచ్చింది. నేనెప్పుడూ మెసేజ్​లు చూడను. తొలి సారి మెసేజ్​లు ఓపెన్ చేయగానే తన రిప్లై ఉంది. నేను ఫేక్ అకౌంట్ అనుకున్నా. అప్పటినుంచి ఇద్దరం చాటింగ్ చేసుకుంటున్నాం. రీసెంట్​గా నేను 50వ సెంచరీ బాదినప్పుడు, జకోవిచ్ ఇన్​స్టాలో స్టోరీ పెట్టి నాకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇద్దరం పరస్పరం గౌరవించుకుంటాం. రీసెంట్​గా ఆస్ట్రేలియా ఓపెన్​లో అతడు బ్యాటింగ్ చేయడం చూశా. టెన్నిస్ రాకెట్ పట్టుకున్నట్లు క్రికెట్ బ్యాట్​ పట్టుకున్నాడు. తనకు బ్యాట్ సరిగ్గా పట్టుకోవడం నేర్పిస్తా' అని విరాట్ అన్నాడు.

ఆల్​ ది బెస్ట్ నొవాక్:ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంపియన్​షిప్ ఆడుతున్న జకోవిచ్​కు విరాట్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు.' గ్రాండ్​స్లామ్స్​ కోసం నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావో తెలుసు. ఆస్ట్రేలియా ఓపెన్​లో నువ్వు బాగా ఆడాలని కోరుకుంటున్నా. ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడడం నాకు చాలా ఇష్టం. నీకు ఆస్ట్రేలియాన్స్ నుంచి సపోర్ట్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్' అని విరాట్ పేర్కొన్నాడు.

'విరాట్, నేను చాటింగ్ చేసుకుంటున్నాం- క్రికెట్ నేర్చుకున్నాక భారత్​కు వస్తా'

టీమ్ఇండియాకు షాక్- తొలి టీ20కి విరాట్ దూరం- కారణం ఏంటంటే?

Last Updated : Jan 14, 2024, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details